10 మంది శ్రీదేవిలతో సమానమైన లీలా నాయుడు కథ! బాలీవుడ్‌ను ఏలి, చివరికి ఏకాకిలా!

14 ఏళ్లకే మిస్ ఇండియా.. తొలి సినిమాతోనే జాతీయ అవార్డు, 17 ఏళ్లకే పెళ్లి.. ఇద్దరు పిల్లలు, మొదటి భర్తతో విడాకులు. మరో పెళ్లి. చివరకు ఏకాకిగా మారిన జీవితం.. ఇంతకు ఆ నటి ఎవరంటే..?

14 ఏళ్లకే మిస్ ఇండియా.. తొలి సినిమాతోనే జాతీయ అవార్డు, 17 ఏళ్లకే పెళ్లి.. ఇద్దరు పిల్లలు, మొదటి భర్తతో విడాకులు. మరో పెళ్లి. చివరకు ఏకాకిగా మారిన జీవితం.. ఇంతకు ఆ నటి ఎవరంటే..?

అందమైన రంగుల ప్రపంచంలో తెర మీద నవ్వులు చిందిస్తూ, మనల్ని ఎంటర్ టైన్ చేస్తున్న ఎంతో మంది నటీమణుల తెరవెనుక ఎన్నో విషాదగాధలున్నాయి. తరచి, తెరచి చూస్తే తప్ప కనిపించవు కన్నీటి వ్యధలు. సంపాదిస్తున్నారు.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు అనుకుంటారు. కానీ ఇంద్ర భవనం లాంటి ఇంట్లో, ఆ గోడల మధ్య ఎంతో మానసిక సంఘర్షణలకు గురైన హీరోయిన్లు ఉన్నారు. వారిలో ఒకరు ఈ పదాహరణాల తెలుగుమ్మాయి. 14 ఏళ్లకే అందగత్తెగా గుర్తింపు. బాలీవుడ్ ఆమె సౌందర్యానికి ఫిదా అయ్యింది.  తొలి సినిమాతో జాతీయ అవార్డ్. పది మంది శ్రీదేవీలతో సమానమైన అప్సరస ఆమె. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు, ఎనలేని సంపద, కీర్తి కానీ ఆమెను జీవితాన్ని అంధకారం చేశాయి వివాహాలు.

ఆమె ఎవరో కాదు తెలుగు అమ్మాయి లీలా నాయుడు. ఆంధ్ర ప్రదేశ్‌లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె (ప్రస్తుతం అన్నమయ్య జిల్లా)కు చెందిన డా. ప్రత్తిపాటి రామయ్య నాయుడు ఏకైక కుమార్తెనే ఈ లీలా. ఆయన అణు శాస్త్రవేత్త, నోబెల్ గ్రీహీత మేరీ క్యూరీ దగ్గర పని చేశాడు. స్విస్ మూలాలున్న పాత్రికేయురాలు, ఇండాలజిస్ట్ డాక్టర్ మార్తే మాంగేను వివాహం చేసుకున్నారు. వీరికి ఉన్న ఏకైక సంతానం లీలా ముంబయిలో పుట్టింది. కానీ పెరిగింది యూరప్‌లో.స్విట్జర్లాండ్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆమె చిన్నప్పటి నుండే నాటకాలు ప్రదర్శించేది. అదే ఆమెను మోడలింగ్, మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేలా చేసింది. 1954లో అంటే ఆమె 14 ఏళ్లలో ఫెమినా మిస్ ఇండియాగా మారింది. 1962లో అనురాధ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. ఈ సినిమాతోనే జాతీయ అవార్డును గెలుచుకుంది. ఆమె ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో నటించింది. డబ్బు కాదు..క్యారెక్టర్ బాగుంటేనే ఒప్పుకునేది.

రాజ్ కపూర్ తన సినిమాల్లో నటించాలని నాలుగు సార్లు కోరగా.. అన్ని సార్లు తిరస్కరించింది లీలా. అలాంటి నటి.. పెళ్లితో జీవితాన్ని పతనం చేసుకుంది. 17 ఏళ్ల ప్రాయంలోనే ఒబెరాయ్ హోటల్స్ వ్యవస్థాపకుడైన మోహన్ సింగ్ కుమారుడు తిలక్ రాజ్‌ను వివాహం చేసుకుంది. తన కన్నా 16 ఏళ్ల పెద్దవాడిని చేసుకుంది ఆమె. వీరికి కవలలలు జన్మించారు. అయితే వీరి పెళ్లి ఎంత కాలం నిలవలేదు. విడిపోయింది ఈ జంట. మళ్లీ 1969లో ముంబయి కవి డోమ్ మోరెస్‌ను రెండో వివాహం చేసుకుంది. అతడితో కూడా విడిపోవడం ఆమెను మానసికంగా కుంగుబాటుకు గురి చేసింది. అప్పటి నుండి ఈ ప్రపంచానికి దూరంగా ఉంటూ.. తన ఇంట్లో ఒంటరిగా జీవితాన్ని గడిపింది. ఆ సమయంలో మద్యానికి బానిస అయ్యింది. ఊపిరి తిత్తుల వైఫల్యంతో 2009లో లీలా నాయుడు మరణించింది. అప్పటికే ఓ కూతురు ప్రియ మరణించడంతో.. మరో కుమార్తె మాయ, మనవరాళ్లు ఆమెకు అంతిమ సంస్కారం నిర్వహించారు.

Show comments