Tirupathi Rao
Tarun Bhaskar- SP Chara Issue: తరుణ్ భాస్కర్ కీడా కోలా సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. అయితే ఆ సినిమాతో ఎస్పీ చరణ్ తో లీగల్ ఇష్యూస్ కూడా వచ్చాయి. వాటిపై తొలిసారి తరుణ్ భాస్కర్ రియాక్ట్ అయ్యాడు.
Tarun Bhaskar- SP Chara Issue: తరుణ్ భాస్కర్ కీడా కోలా సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. అయితే ఆ సినిమాతో ఎస్పీ చరణ్ తో లీగల్ ఇష్యూస్ కూడా వచ్చాయి. వాటిపై తొలిసారి తరుణ్ భాస్కర్ రియాక్ట్ అయ్యాడు.
Tirupathi Rao
టాలీవుడ్ లో ఉన్న యంగ్ టాలెంట్ లో తరుణ్ భాస్కర్ పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. ఒక డైరెక్టర్ గానే కాకుండా.. యాక్టర్ కూడా మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. నిజానికి యాక్టర్ గానే తరుణ్ భాస్కర్ కి ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇటీవలే కీడా కోలా అనే సినిమాతో టాలీవుడ్ ని తరుణ్ బాస్కర్ షేక్ చేశాడు. తన టేకింగ్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశాడు. అయితే ఈ సినిమాలో చేసిన ఒక చిన్న ప్రయోగం తరుణ్ భాస్కర్ ని లీగల్ గా చిక్కుల్లో పడేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా తరుణ్ భాస్కర్ ఆ ఇష్యూపై స్పందించాడు.
టాలీవుడ్ లో ఎంతో మంది యంగ్ హీరోలు, డైరెక్టర్లు ఉన్నారు. ఎవరికి వాళ్లు వాళ్ల మార్క్ చూపిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. వారిలో కాస్త యునీక్ గా అటు డైరెక్టర్ గానే కాకుండా.. ఇటు యాక్టర్ గా కూడా తరుణ్ భాస్కర్ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. తాజాగా వచ్చిన కీడా కోలా చిత్రం తరుణ్ భాస్కర్ స్కిల్స్, టాలెంట్ కి మంచి ఉదాహరణ అని చెప్పచ్చు. ఆ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ క్రియేటివ్ థాట్స్ కి మంచి అప్లాజ్ లభించింది. అయితే అదే క్రిటేవిటీ వల్ల తరుణ్ భాస్కర్ లీగల్ చిక్కుల్లో కూడా పడ్డాడు. కీడా కోలా సినిమాకి సంబంధించి తరుణ్ భాస్కర్ ఒక ప్రయోగం చేశాడు.
అదేంటంటే.. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ని వాడి లెంజడరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్ ని రీ క్రియేట్ చేశాడు. అలా చేసి సినిమాలో వాడేశాడు. ఆ ప్రయోగానికి మంచి రెస్పాన్సే వచ్చింది. కానీ, ఎస్పీ చరణ్ మాత్రం దీనిని సీరియస్ గా తీసుకున్నాడు. తన తండ్రి వాయిస్ ని ఇలా రీ క్రియేట్ చేయడం బాగుందని చెప్పాడు. అలాగే కొత్త కొత్త ఏఐ వంటి టెక్నాలజీతో ఇలా తన తండ్రి వాయిస్ ని మళ్లీ అందరూ వినేలా చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. కానీ, తమకు చెప్పకుండా, తమ కుటుంబం అనుమతి తీసుకోకుండా నేరుగా కమర్షియల్ పర్పస్ లో సినిమాలో వాడేయండపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తరుణ్ భాస్కర్ పై కేసు వేయడమే కాకుండా.. రూ2 కోట్లు డిమాండ్ కూడా చేశారు. అయితే ఈ విషయంపై అప్పట్లో తరుణ్ భాస్కర్ ఎక్కడా ఓపెన్ గా స్పందించలేదు. కానీ, తాజాగా తరుణ్ భాస్కర్ ఆ ఇష్యూపై స్పందిచాండు.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. “ఈ విషయంలో మా సైడ్ నుంచి అలాగే ఎస్పీ సార్ సైడ్ నుంచి కమ్యునికేషన్ ఇష్యూస్ వచ్చాయి. ఎవరైనా ఏదైనా కొత్తగా, ఎగ్జైటింగ్ గా చేయాలి అనుకుంటారు. మనకున్న లెంజెండ్స్ ని గౌరవించాలనే అనుకుంటాం. అంతేగానీ ఎవరినీ డిస్ రెస్పెక్ట్ చేయాలి అనే ఉద్దేశం ఏమీ లేదు. మేము చేసేవి చిన్న సినిమాలు. నేను చేసే సినిమాలు చూస్తున్నారు. ఏదో పెద్ద స్టార్స్ తో కమర్షియల్ గా చేయాలి అనేం కోరుకోవడం లేదు. ఇందులో అసలు కమర్షియల్ మెంటాలిటీ ఏమీ లేదు. మేకు ఏదైనా కొత్తగా చేయాలి అనుకున్నాం. ఇప్పుడు అంతా ఓకే. క్లియర్ అయ్యాయి” అంటూ తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చాడు. తరుణ్ భాస్కర్ ప్రెజెంట్ చేస్తున్న తులసివనం అనే సిరీస్ ప్రమోషనల్ ఈవెంట్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఎస్పీ చరణ్- తరుణ్ భాస్కర్ లీగల్ ఇష్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.