P Krishna
చట్టం ముందు అందరూ సమానమే అని మరోసారి రుజువైంది.. మహిళా జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ నటుడికి కోర్టు షాక్ ఇచ్చింది.
చట్టం ముందు అందరూ సమానమే అని మరోసారి రుజువైంది.. మహిళా జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ నటుడికి కోర్టు షాక్ ఇచ్చింది.
P Krishna
దేశంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. మహిళలపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, లైంగికంగా ఇబ్బందికి గురి చేసినా ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటుంది. కేంద్రం రూపొందించిన నిర్భయ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టాలు ద్వారా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పపడిన వారిని కఠినంగా శిక్షిస్తున్నారు. అయితే ఎన్ని శిక్షలు విధించినా.. కొంతమంది మగాళ్ల వంకర బుద్ది మారడం లేదని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. సామాన్య మహిళలే కాదు.. సెలబ్రెటీలు, రాజకీయ, క్రీడా రంగాల్లో ఉన్నవారు కూడా పురుషుల వేధింపులకు గురవుతున్నారు. ఓ మహిళా జర్నలిస్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నటుడికి కోర్టు షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..
తమిళనాట రాజకీయాల్లో రాణిస్తూ.. నటుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఎస్వీ శేఖర్ కి ప్రత్యేక కోర్టు షాక్ ఇచ్చింది. జర్నలిస్ట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు నెలరోజుల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ కోర్టుల సోమవారం తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. 2018 లో ఎస్వీ శేఖర్ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ పోస్ట్ తీవ్ర సంచలనం రేపింది. మహిళా జర్నలిస్టును ఉద్దేశించి ఆయన ఒక పోస్ట్ చేశాడు.. తమిళనాడులో మహిళా జర్నలిస్టులందరూ తమ ఉద్యోగాల కోసం ఉన్నతాధికారులతో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకుంటున్నారని ఆరోపిస్తూ పోస్ట్ వివాదానికి తెరలేపింది. చెన్నై మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎస్వీ శేఖర్ చేసిన వ్యాఖ్యలపై మహిళా జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే శేఖర్ తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. ఆయనపై నమోదు అయిన కేసు కొనసాగుతూ వచ్చింది. పలుమార్లు ఆ కేసు రద్దు చేయాలని హై కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. అంతేకాదు ఈ కేసు విచారణను ఎదుర్కొవాల్సిందే అని హై కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయ వేల్ విచారిస్తూ వచ్చారు. ఇరు పక్షాల వాదనలు ముగిసిన తర్వాత సోమవారం తీర్పు వెలువరించారు. ఒక నెల జైలు శిక్ష, రూ.15 వేలు జరిమానా విధించారు. అయితే అప్పీల్ కు అవకాశం కల్పించాలని ఎస్వీ శేఖర్ లాయర్లు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి శిక్షను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే అప్పీల్ కోసం నాలుగు వారాల లోపు ప్రయత్నాలు చేయాలని, ఆ తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిం కోర్టు లో లొంగిపోవాల్సి ఉంటుందని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.