Keerthi
స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద తరుచు ఏదో ఒక వివాదంతో వార్తలో నిలుస్తునే ఉంటుంది. అయితే తాజాగా మరోసారి ఓ వివాదంలో కలగజేసుకున్న చిన్మయికి పెద్ద చిక్కు వచ్చి పడింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేయాలంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.
స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద తరుచు ఏదో ఒక వివాదంతో వార్తలో నిలుస్తునే ఉంటుంది. అయితే తాజాగా మరోసారి ఓ వివాదంలో కలగజేసుకున్న చిన్మయికి పెద్ద చిక్కు వచ్చి పడింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేయాలంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.
Keerthi
ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి గురించి అందరికి తెలిసిందే. ఈమె స్వరం అభిమానులకు వరం. ఎన్నో ఆద్భుతమైన పాటాలకు తన గాత్రన్ని అందించి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది చిన్నయి. కానీ, ఇటీవల కాలంలో తరుచు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఒక గాయనిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న చిన్మయి.. సోషల్ మీడియాలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. నిత్యం సమజంలో జరిగిన సంఘటనలకు స్పందిస్తూ.. లేనిపోని కాంట్రావర్సికి గురవతుంది. ఇటీవలే ఆమె ఓ సీనియర్ ఆర్టిస్ట్ చేసిన వ్యాఖ్యలకు తనదైన స్టైల్ లో సోషల్ మీడియా ఖాతాలో సమాధానం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వివాదమే చిన్మయిని పెద్ద చిక్కులో పడేసింది. తాజాగా చిన్మయిని అరెస్టు చేయాలంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.
ఇటీవలే చిన్మయి.. సీనియర్ నటి అన్మపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూలో మహిళల వేషధారణపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో భారత దేశాన్ని స్టుపిడ్ కంట్రీ, ఇక్కడ పుట్టడం నా కర్మ అంటూ ఘటూగా మాట్లాడింది. అయితే ఈ వ్యాఖ్యలే ఆమెకు పెద్ద చిక్కులో పడేశాయి. తాజాగా చిన్మయి మాటాలను హెచ్‌సీయూ విద్యార్థి కుమార స్వామి ఖండిస్తూ.. ఆమె పై గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా..’చిన్మయి, అన్నపూర్ణమ్మకు ఏదైనా చెప్పాలనుకుంటే ఆమె గురించి చెప్పాలి. కానీ, ఇలా భారత దేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం సరికాదన్నారు. అలాగే భారతదేశంలో ఉంటూ, ఇక్కడ సౌకర్యాలు అనుభవిస్తూ, ఈ దేశపు గాలిని పీల్చి, ఇక్కడ పుట్టడమే నా కర్మ అనడం, ఇది ఒక చెత్త దేశమని వ్యాఖ్యానించడం దారుణమన్నారు. అందుకే ఓ బాధ్యత గల పౌరుడిగా నా భారతదేశం పట్ల అగౌరవమైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను చిన్మయి పై పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఆమె పై తగిన చర్యలు తీసుకోవాలని’ కుమారస్వామి పోలీసులకు కోరుతున్నారు.
అయితే అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..’అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా.. ఆడదానికి ఎందుకు స్వాతంత్య్రం కావాలి, రాత్రి 12 గంటల తర్వాత ఏం పని.. అలాగే ఇప్పుడు ఎక్స్‌పోజింగ్ ఎక్కువైపోయింది. ఎవరూ మనల్ని ఏమీ అనొద్దు అనుకున్నా.. అందరూ మనల్ని ఏదో ఒకటి అనేట్లుగానే రెడీ అవుతున్నాం అన్నారు. అంతేకాకుండా.. ఎప్పుడూ ఎదుటివాళ్లది తప్పు అనకూడదు, మనవైపు కూడా కొంచెం ఉంటుంది’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈమె వ్యాఖ్యలకు స్పందించిన చిన్మయి కౌంటర్ వేస్తూ..’ఫేవరెట్ అనుకున్న వాళ్లే ఇలా మాట్లాడితే గుండె ముక్కలు అవుతోందన్నారు. ఆమె చెబుతున్న రూల్స్ ప్రకారం అడవాళ్ల చీకటి పడితే బయట తిరగకూడదు.. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా రాత్రివేళల్లో ఇంట్లో నుంచి బయటకు రాకూడదు అనడం సరికాదన్నారు. నర్సులు, డాక్టర్లుగా పనిచేయకూడదు.. ఇలాంటి వారి మాటలు వింటుంటే ఇండియా లాంటి స్టుపిడ్ కంట్రీలో ఆడపిల్లగా ఎందుకు పుట్టామా అనిపిస్తుందంటూ’ ఘాటుగా స్పందించింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే చిన్మయికి చిక్కుల్లో నెట్టినట్టు అయ్యింది. మరి, చిన్మయి చేసిన వ్యాఖ్యలకు గాను ఆ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.