Nidhan
దర్శకధీరుడు రాజమౌళి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తృటిలో దాని నుంచి బయటపడ్డారు జక్కన్న. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..
దర్శకధీరుడు రాజమౌళి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తృటిలో దాని నుంచి బయటపడ్డారు జక్కన్న. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
దర్శకధీరుడు రాజమౌళి ఒక్కో సినిమాతో తన ఇమేజ్ను పెంచుకుంటూ పోతున్నారు. ‘బాహుబలి’ సిరీస్ ముందు వరకు ఆయన టాలీవుడ్‌కే పరిమితమయ్యారు. కానీ ఆ మూవీలోని రెండు పార్ట్లు బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత తీసిన ‘ఆర్ఆర్ఆర్’తో ఆయన క్రేజ్ పాన్ వరల్డ్ రేంజ్‌కు ఎదిగింది. యూఎస్, జపాన్ లాంటి విదేశాల్లో ‘ఆర్ఆర్ఆర్’ మేనియా ఇప్పటికీ తగ్గట్లేదు. ఆ దేశాల్లో వసూళ్లలో బీభత్సం సృష్టించడమే గాక ప్రేక్షకుల మనసులకూ హత్తుకుంది జక్కన్న చిత్రం. ‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళి ఎవరనే చర్చ హాలీవుడ్‌తో పాటు ప్రపంచ సినిమా మొత్తం చర్చించుకుంది. అలాంటి దర్శకధీరుడు ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో చేస్తున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ఆయనకు ఓ ప్రమాదం తప్పింది.
జపాన్ విజిట్‌లో ఉన్న రాజమౌళి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అక్కడ భూకంపం బారి నుంచి తృటిలో బయటపడ్డారు జక్కన్న. ఈ విషయాన్ని ఆయన కుమారుడు కార్తికేయ తెలిపారు. తాము ఓ బిల్డింగ్‌లోని 28వ అంతస్తులో ఉన్నామని అప్పుడే మెళ్లిగా భూమి కంపించడం మొదలైందని ట్విట్టర్లో పెట్టిన పోస్టులో కార్తికేయ చెప్పుకొచ్చారు. ‘జపాన్‌లో ఇప్పుడే భూకంపం ఎలా ఉంటుందో చూశా. మేం 28వ అంతస్తులో ఉన్నాం. బిల్డింగ్ మెళ్లిగా కదలడం స్టార్ట్ అయింది. దీంతో ఇది భూకంపం వల్లేనని అర్థమైంది. మేం టెన్షన్ పడసాగాం. కానీ చుట్టూ ఉన్న జపనీయులు మాత్రం ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్నారు. ఏదో వాన పడుతున్నంత ఈజీగా వాళ్లు లైట్ తీసుకున్నారు. మొత్తానికి భూకంపాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేశాం’ అని కార్తికేయ ఆ పోస్టులో రాసుకొచ్చారు.
Felt a freaking earthquake in Japan just now!!!
Was on the 28th floor and slowly the ground started to move and took us a while to realise it was an earthquake. I was just about to panic but all the Japanese around did not budge as if it just started to rain!! 😅😅😅😅😅… pic.twitter.com/7rXhrWSx3D— S S Karthikeya (@ssk1122) March 21, 2024