పప్పులో పాము.. ఈసీఐఎల్‌ క్యాంటీన్‌లో ఘటన..

మనం తినే ఆహారంలో చిన్న చిన్న పురుగులు, రాళ్లు రావటం సాధారణం. కొన్ని అరుదైన సంఘటనల్లో కూరల్లో కప్పలు ఇతర జీవులు దర్శనమిస్తూ ఉంటాయి. కానీ, అత్యంత అరుదుగా మాత్రమే మనల్ని షాక్‌కు గురి చేసే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా పాము అంటే జనాలకు ఎంత భయం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది.. తినే ఆహారంలో పాము వస్తే ఎలా ఉంటుంది. ఒళ్లు జలదరిస్తుంది కదూ..హైదరాబాద్‌ నగరంలోని ఈసీఐఎల్‌ క్యాంటీన్లో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. క్యాంటీన్‌లో భోజనం చేస్తూ ఉండగా..

పప్పులో పాము పిల్ల కనిపించింది. దీంతో భోజనం చేస్తూ ఉన్న వారు షాక్‌కు గురయ్యారు. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈసీఐఎల​ సెంట్రల్‌ క్యాంటీన్‌లో వండిన ఆహారాన్ని చర్లపల్లిలోని ఈవీఎం సంస్థకి తీసుకెళుతూ ఉంటారు. శుక్రవారం మధ్యాహ్నం ఉద్యోగులకు ఆహారం పెడుతూ ఉండగా.. పప్పులో పాము పిల్ల వెలుగుచూసింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. అన్నం తింటున్న వారు కూడా ప్లేట్లను పక్కన పడేశారు. ఓ వ్యక్తి చనిపోయిన పాము పిల్లను ఫొటో తీశాడు.

ప్రస్తుతం ఆ ఫొటో కాస్తా.. మీడియాలో.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్యాంటీన్‌లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయని ఉద్యోగులు చెబుతూ ఉన్నారు. ఎలుకలు, బీడీలు, సిగరెట్లు, జిల్ల పురుగులు చాలా సార్లు వచ్చినట్లు వారు తెలిపారు. ఇప్పుడు ఏకంగా పాము పిల్ల రావటంతో తమ ఆరోగ్యానికి భద్రత కరువైందని వాపోతున్నారు. పరిశుభ్రంగా వంట చేయని వారిపై చర్యలు తీసుకోవాలని అధికారుల్ని డిమాండ్‌ చేస్తున్నారు. మరి, ఈసీఐఎల్‌ క్యాంటీన్‌లో పప్పులో పాము పిల్ల రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments