Venkateswarlu
సింగర్ సునీత తాజాగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను షేర్ చేసుకున్నారు. వైవాహిక జీవితం కారణంగా చాలా ఇబ్బందులు పడ్డానని అన్నారు.
సింగర్ సునీత తాజాగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను షేర్ చేసుకున్నారు. వైవాహిక జీవితం కారణంగా చాలా ఇబ్బందులు పడ్డానని అన్నారు.
Venkateswarlu
సింగర్ సునీత గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు 30 ఏళ్లుగా ఆమె తన గాత్రంతో సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉన్నారు. ఈ 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో సునీత కొన్ని వందల పాటలు ఆలపించారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పాటలు పాడారు. పలు పాటలకు బెస్ట్ సింగర్‌గా అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. సింగర్ గానే కాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా ఆమె పలువురు నటీమణులకు గొంతు అరువిచ్చారు. స్టార్ హీరోయిన్ సౌందర్య దగ్గరినుంచి ఇప్పటి హీరోయిన్ల వరకు డబ్బింగ్ చెబుతూ ఉన్నారు.
తన గాత్రంతో ఎంతో మంది బాధల్ని పోగొట్టిన సింగర్ సునీత జీవితంలో ఎంతో విషాదం దాగుంది. చిన్న వయసులోనే పెళ్లి.. ఆ తర్వాత వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డారు. వ్యక్తిగతంగానూ.. వృత్తి పరంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 17 ఏళ్లకే సినీ కెరీర్ మొదలుపెట్టానని, 19 ఏళ్లకు పెళ్లి అయిందని అన్నారు. పెళ్లి తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు.
ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన 28 ఏళ్ల కెరీర్‌లో 5 వేలకు పైగా షోలు చేశానని అన్నారు. తన గొంతు హస్కీగా ఉందని, కొన్ని మాటలు గొంతులోనే ఆపేస్తోందని చాలా మంది నానా మాటలు అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్డూడియోను దేవాలయంలా భావించేదాన్నని.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను స్డూడియో బయటే వదిలేసి వెళ్లేదాన్నని అన్నారు. స్డూడియోలో పర్సనల్స్ మాట్లాడేదాన్ని కాదని అన్నారు. కానీ, ఆ విషయంలో కొన్ని కామెంట్లు తనను బాధించాయని తెలిపారు. తాను చాలా సెన్సిటివ్ అని.. ప్రతీ దానికి ఏడ్చేస్తానని అన్నారు. రెండో పెళ్లి చేసుకోవటం తన జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయంగా అభిప్రాయపడ్డారు. తనకు 35 ఏళ్లు వచ్చే వరకు కష్టపడుతూనే ఉన్నానని, తన చుట్టూ ఉన్న వాళ్లు చాలా సార్లు తనను మోసం చేశారని అన్నారు.
మోసపోయిన ప్రతీసారి షాక్ అయ్యేదాన్నని తెలిపారు. తన గురించి చెప్పటం ఇష్టం లేనపుడు నవ్వి వదిలేస్తానని అన్నారు. కాగా, సింగర్ సునీత 1992లో వచ్చిన గులాబి సినిమాలో ‘ ఈ వేళలో నువ్వు ఏం చేస్తున్న ఉంటావో’ పాటతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తర్వాత ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో ఆమె బిజీబిజీగా గడుపుతున్నారు. మరి, సింగర్ సునీత తన జీవితంలో చోటుచేసుకున్న కొన్ని బాధాకర విషయాల గురించి చెబుతూ ఎమోషనల్ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.