మూడు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానం ఆమెది. ఈ ప్రస్థానంలో ఎన్నో పాత్రలు, ఎన్నో ప్రశంసలు. ఇక తన సినీ కెరీర్ లో దాదాపు 360కు పైగా చిత్రాల్లో నటించింది. సినిమాలే కాకుండా సీరియల్స్ లోనూ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అలాంటి నటి ప్రస్తుతం అత్యంత దీనస్థితిలో ఉంది. 2021 నుంచి అల్జీమర్స్ తో పాటుగా పార్కిన్సన్స్ వ్యాధితో సీనియర్ నటి కనకలత బాధపడుతున్నట్లు ఆమె సోదరి తెలిపింది. మలయాళం, తమిళ ఇండస్ట్రీలో దాదాపు మూడు దశాబ్దాలకు పైగా కొనసాగారు. మలయాళ సినిమాలు అయిన ప్రియం, కన్మణి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఇంతటి సీనియర్ నటి ప్రస్తుతం అత్యంత దీనస్థితిలో జీవితాన్ని వెళ్లదీస్తోంది.
సీనియర్ నటి కనకలత.. మలయాళం, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తన సినీ కెరీర్ ను కొనసాగించిన కనకలత.. 360కు పైగా సినిమాల్లో నటించారు. సినిమాలతో పాటుగా సీరియల్స్ లో కూడా నటించి అభిమానులను మెప్పించారు. ఇంతటి స్టార్ నటి ప్రస్తుతం అత్యంత దయనీయ జీవితాన్ని వెళ్లదీస్తున్నట్లు ఆమె సోదరి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కనకలత 2021లో అనారోగ్యం బారిన పడిందని, ఆమెకు అల్జీమర్స్ తో పాటుగా పార్కిన్సన్స్ వ్యాధి సోకిందని ఆమె తెలిపారు.
కాగా.. చాలా రోజుల నుంచి ఆమె ఐసీయూలోనే చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె సోదరి పేర్కొన్నారు. ఆమెకు పేరు కూడా గుర్తులేదని, తన రోజువారి కాలకృత్యాలు కూడా మరచిపోతుందని సోదరి వాపోయింది. కాగా.. కనకలతకు మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి రూ. 5వేల పెన్షన్ అందుతోంది. ప్రస్తుతం ఆమె ఎలాంటి ఆహారం తీసుకోట్లేదని, కేవలం లిక్విడ్స్ మాత్రమే తాగుతోందని ఆమె వెల్లడించారు. చివరిగా కనకలత పూక్కలం అనే చిత్రంలో కనిపించారు. కనకలతకు అసోసియేషన్ ఆఫ్ టెలివిజన్ మీడియా ఆర్టిస్ట్స్ , ఫిల్మ్ అకాడమీ ద్వారా ఆర్థిక సహాయం అందుతోంది. ఆమె దీనస్థితి గురించి తెలిసిన అభిమానులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.