ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత!

ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. చిన్నా పెద్దా అనే వయసు తేడా లేకుండా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.

ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. చిన్నా పెద్దా అనే వయసు తేడా లేకుండా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.

ఈ మద్య దేశంలో వరుస గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూస్తున్నారు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. వయోభారం, ఎక్కువగా వ్యాయామం చేయడం, పని ఒత్తిడి ఇలా ఎన్నో కారణాల వల్ల గుండెపోటుతో చనిపోతున్నారు. ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. హార్ట్ ఎటాక్ తో పలువురు సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

బోజ్‌పూరి సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నెల మాలీవుడ్ నటి లక్ష్మిక సజీవన్ గుండెపోటుతో చిన్నవయసులోనే కన్నుమూసింది. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే బోజ్‌పూరి ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు బ్రిజేష్ త్రిపాఠి కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలోనే ముంబైలోని తన నివాసంలో నిన్న రాత్రి హఠాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అక్కడే చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఆయన చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.

బ్రిజేష్ త్రిపాఠి 1979 లో సాయా తొహారే కరణ్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 250 సినిమాలకు పైగా నటించారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలు జయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి, రవి కిషన్, ధర్మేంద్ర, వినోద్ ఖన్నా‌లతో నటించారు. బోజ్ పూరి ఇండస్ట్రీకి చెందిన నటుడు బ్రిజేష్ త్రిపాఠి తన 42 ఏఏళ్ల కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. బాలీవుడ్ లో 1980 లో టాక్సీ చోర్ మూవీ మంచి పేరు తీసుకువచ్చింది. బ్రిజేష్ త్రిపాటి గొప్ప విలక్షణ నటుడు మాత్రమే కాదు.. గొప్ప మనసు గలవాడు అని, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని సెలబ్రెటీలు, అభిమానులు వేడుకుంటున్నారు.

Show comments