P Krishna
Samantha Shocking Comments: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన నటి సమంత మయోసిస్ వ్యాధితో బాధపడుతూ కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తుంది.
Samantha Shocking Comments: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన నటి సమంత మయోసిస్ వ్యాధితో బాధపడుతూ కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తుంది.
P Krishna
తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఏ మాయ చేసావె’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సమంత. ఈ చిత్రంలో హీరోగా నటించిన అక్కినేని నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంత కాలం తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరి ప్రొఫెషన్ లో వారు బిజీగా ఉన్నారు. విడాకులు తర్వాత వరుస హిట్ చిత్రాల్లో నటించిన సమంత మయోసైటీస్ వ్యాధి భారిన పడి కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. ఈ మధ్యనే మయోసైటీస్ ట్రీట్ మెంట్ చేసుకొని కొలుకుంటూ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ వెబ్ సీరీస్ షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన గురించి సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే..
సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటే సమంత తాజాగా ఓ వెబ్ సీరీస్ షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఎలాంటి వారైనా ఆరోగ్యం సరిగా లేకుంటే మానసికంగా కృంగిపోతారు. నా జీవితంలో కూడా నేను చాలా సార్లు ఆవేదనకు గురయ్యాను. మయోసైటీస్ వ్యాధి వచ్చినపుడు వారంలో తగ్గిపోతుందని కూల్ గా ఉన్నాను. తర్వాత దాని ప్రభావం నా జీవితంపై దారుణంగా చూపించింది. ఒక్కోసారి ఈ వ్యాధి నాకే ఎందుకు వచ్చిందని బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఈ వ్యాధితో ఏడాదిన్నర నుంచి నేను పోరాడుతున్నా అంటే నాకే నమ్మశక్యంగా లేదు. మనసు దృఢంగా ఉంటే ఏదైనా సాధించవొచ్చు అనే నిర్ణయంతో పోరాడుతున్నా.
నేను సినిమాలకు కొంత కాలం బ్రేక్ ఇవ్వడం చాలా సంతోషం అనిపించింది.. కాస్త రిలాక్స్ గా కూడా ఉంది. విజయ్ దేవరకొండతో ఖుషి మూవీ చేసిన తర్వాత సిటాడెల్ అనే వెబ్ సీరీస్ కి సైన్ చేశాను. ఆ షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో కొన్ని యాక్షన్ సీన్లు చేస్తున్నాను. హఠాత్తుగా నా శరీరం అంతా నొప్పులు.. తిమ్మిర్లు వచ్చాయి. తీవ్ర అస్వస్థతతో సృహ తప్పి అక్కడే పడిపోయాను. వెంటనే టీమ్ సభ్యులు నన్ను హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. షూటింగ్ ఆగిపోయిందని చాలా బాధపడ్డాను. తర్వాత కోలుకొని షూటింగ్ పూర్తి చేశాం. ఇప్పుడు సిటాడెల్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నా అని అన్నారు సమంత.