Keerthi
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ హీరోకు ఈ దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే సల్మాన ఖాన్ పేరు మీద తాజాగా ఓ ఫేక్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అదేమిటంటే..
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ హీరోకు ఈ దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే సల్మాన ఖాన్ పేరు మీద తాజాగా ఓ ఫేక్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అదేమిటంటే..
Keerthi
దేశంలో రోజు రోజుకి కొత్త తరహా సైబర్ మోసాలుపెరిగిపోతున్నాయి. ఈజీగా డబ్బను సంపాదించాలనే నేపథ్యంలో ఈ సైబర్ కేటుగాళ్లు.. చాలా తెలివిగా ప్రజలను బురిడీ కొట్టిస్తూ లక్షలకు లక్షలు నగదును కొల్లగొడుతున్నారు. ఇక ఈ మోసాల పట్ల ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా సరే.. ఏ వైపు నుంచి ఏ రూపంలో మోసాలకు పాల్పడుతున్నారో ఊహకు కూడా అందడం లేదు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే ఈ సైబర్ కేటుగాళ్లు సెలబ్రిటీస్ పేరును వినియోగిస్తూ.. భారీగానే స్కేచ్ లు వేస్తూ తప్పుడు ప్రచారాలు, స్కామ్ లకు పాల్పడుతుంటారు. ఇలా వీరి వలలో చిక్కుకున్న సినీ అభిమానులు వాస్తవాలు తెలుసుకోకుండా.. తప్పుడు ప్రచారాలకు ఆకర్షితులై మోసపోతున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పేరును వినియోగించి కొంతమంది కేటుగాళ్లు పెద్ద ఎత్తునే మోసానికి పాల్పడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ హీరోకు ఈ దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే సల్మాన ఖాన్ పేరు మీద తాజాగా ఓ ఫేక్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అదేమిటంటే.. అమెరికాలో జరగనున్న ఓ ఈవెంట్లో సల్మాన్ పాల్గొననున్నట్లు ప్రచారం జరుగుతంది. గత రెండు రోజులుగా అమెరికాలోని ఆర్లింగ్టన్ థియేటర్‌లో అక్టోబర్ 5 న జరిగిన ఈవెంట్ లో సల్మాన్ ప్రదర్శన ఇవ్వబోతున్నట్లు సంబంధించి వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పైగా ఆ పోస్ట్ లో ఈవెంట్ కు టికెట్స్ కొనాలని ఉంది. దీంతో ఇప్పటికే చాలామంది అభిమానులు సల్మాన్ ఖాన్ చూసేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నారు. మరి కొంతమంది టికెట్స్ బుక్ చేసుకునేందుకు తెగ ఆరాట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజగా సల్మాన్ టీం ఈ విషయం పై స్పందించి ఓ పోస్టు ను రిలీజ్ చేశారు.
ఇక ఆ పోస్ట్ లో 2024లో అమెరికాలో జరిగే ఏ ఈవెంట్ కు సల్మాన్ ఖాన్ కు ఎలాంటి సంబంధం లేదు. అలాగే ఆయన అనుబంధ కంపెనీలకు కూడా దీనిపై ఎలాంటి సమాచారం లేదు. ముఖ్యంగా ఆయన టీమ్ అమెరికాలో ఎలాంటి కచేరీలు, ప్రదర్శనలు నిర్వహించడం లేదు. కనుక సల్మాన్ ఈ ఈవెంట్ లో పాల్గొననున్నట్లు వస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదు. ఇక ఇందుకు సంబంధించిన మెయిల్స్, సందేశాలను, ప్రచారాన్ని దయచేసి నమ్మకండి. ఇలా కావాలనే కొందరు మోసగాళ్లు సల్మాన్ పేరును తప్పుగా వినియోగిస్తూ.. ప్రజలను మోసం చేస్తున్నారు. కనుక ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు మేము సిద్ధమయ్యాం. అంటూ సల్మాన్ ఇన్ స్టాలో పోస్ట్ ను షేర్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఇప్పటికీ టికెట్ చేయడంతో.. తాము మోసపోయామని గ్రహించి వాపోయారు. మరీ సల్మాన్ పేరిట సోషల్ మీడియాలో వస్తున్న ఈ తప్పుడు ప్రకటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.