Rashmika Mandanna: రష్మిక డీప్ ఫేక్ వీడియో.. నిందితుడు APలో అరెస్టు

రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో కేసులో పోలీసులు ఎట్టకేలకు పురోగతి సాధించారు. వీడియో క్రియేట్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో కేసులో పోలీసులు ఎట్టకేలకు పురోగతి సాధించారు. వీడియో క్రియేట్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

టెక్నాలజీ అనేది రాను రాను కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత లాభాలు ఎలా అయితే ఉన్నాయో.. నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అందుకు ఉదాహరణలు చాలానే ఉన్నాయి. వాటిలో బాగా వైరల్ అయ్యింది రష్మికా మందన్నా డీప్ ఫేక్ వీడియో. ఈ వీడియో టాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయ్యింది. ముఖ్యంగా మహిళల భద్రతపై అందరూ ఆందోళనలు వ్యక్తం చేశారు. ఇలాంటి టెక్నాలజీ వల్ల మహిళలకు భద్రత ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి అప్ డేట్ వచ్చింది. ఆ వీడియోని ఎవరైతే క్రియేట్ చేశారో.. అతడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

పాన్ ఇండియా హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు చెందిన ఒక డీప్ ఫేక్ వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. బ్లాక్ కలర్ డ్రెస్సులో అభ్యంతరకరంగా ఉన్న రీతిలో రష్మికా మందన్నా లిఫ్టు ఎక్కుతున్నట్లు ఒక వీడియోను ఎడిట్ చేశారు. అతి కొద్ది సమయంలోనే ఆ వీడియో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సెలబ్రిటీలు మొదలు రాజకీయ నాయకుల వరకు అందరూ మహిళల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డీప్ ఫేక్ వీడియోపై కేసు కూడా నమోదు అయింది. ఈ ఘటన జరిగి సరిగ్గా 2 నెలలు కావస్తోంది. ఇప్పుడు పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించారు. ఆ వీడియో ఎడిట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బ్రిటీష్- ఇండియన్ సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్ అయిన జరా పటేల్ కు చెందిన వీడియో అది. మొదట అందరూ ఆ వీడియోలో ఉన్న జరా పటేల్ పై విమర్శలు కురిపించారు. అయితే ఆ తర్వాత ఆమె తాను కూడా ఒక బాధితురాలినే అంటూ తన వర్షన్ ను నెటిజన్స్ కు వినిపించింది.

ఈ మొత్తం వ్యవహారంలో ఈ డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వాళ్లను అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. మొత్తానికి 2 నెలల తర్వాత అతడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఆ నిందితుడినని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని పేరు నవీన్ గా చెబుతున్నారు. ఈ నవీన్ బీటెక్ చదువుతున్నాడు. అతను మొత్తం 3 ఫ్యాన్ పేజెస్ ని రన్ చేస్తున్నాడు. వాటిలో రష్మికా మందన్నా పేజ్ కూడా ఒకటి. అయితే ఆ పేజ్ కు అంతగా రీచ్ లేకపోవడంతోనే ఇలాంటి ఒక డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి ఫ్యాన్ బేస్ ని పెంచుకోవాలని చూసినట్లు చెబుతున్నారు. ఇటీవలికాలంలో ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ దెబ్బకు ఎంతో మంది సెలబ్రిటీలు బాధితులుగా మారారు. వారిలో అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, రష్మికా మందన్నా, ప్రియాంక చోప్రా, సచిన్ ఈ టెక్నాలజీ వల్ల బాధింపబడిన వాళ్లే. మరి.. డీప్ ఫేక్ వీడియో నిందితుడు అరెస్టు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments