ప్రభాస్‌కి డాన్స్ నేర్పిన రాకేష్ మాస్టర్ పరిస్థితి ఎందుకు ఇలా మారింది.. ఆయన బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే!

ప్రభాస్‌కి డాన్స్ నేర్పిన రాకేష్ మాస్టర్ పరిస్థితి ఎందుకు ఇలా మారింది.. ఆయన బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే!

ప్రముఖ టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ రాకేష్‌ మాస్టర్‌.. అనారోగ్యం కారణంగా ఆదివారం సాయంత్రం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక రాకేష్‌ మాస్టర్‌ అనగానే.. వివాదాస్పద ఇంటర్వ్యూలే గుర్తుకు వస్తాయి. యూట్యూబ్‌ చానెల్స్‌కి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. ఇండస్ట్రీకి చెందిన వారి మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉండేవాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ వంటవి వారికి రాకేష్‌ మాస్టర్‌ గురువు. ఇక ఆయన మృతి నేపథ్యంలో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఒక ఫొటో తెగ వైరవలుతోంది. అది చూసిన వారు అసలు రాకేష్‌ మాస్టర్‌ బ్యాగ్రౌండ్‌ ఏంటి.. ఆయన ఎందుకు ఇలా మారారు అని చర్చించుకుంటున్నారు. ఇంతకు ఆ ఫొటోలో ఏం ఉంది అంటే.

ప్రభాస్‌.. ఇప్పుడు కేవలం టాలీవుడ్‌కు మాత్రమే చెందిన హీరో కాదు. పాన్‌ ఇండియా స్టార్‌. బాహుబలి చిత్రం ద్వారా పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ప్రభాస్‌. ప్రస్తుతం ఆదిపురుష్‌ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెబల్‌ స్టార్‌ కృష్టంరాజు వారసుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్‌. ఈ ‍క్రమంలో ఆయన సినీ పరిశ్రమలోకి రావడానికి ముందే యాక్టింగ్‌, డ్యాన్స్‌ ట్రైనింగ్‌ తీసుకున్నారు. రాకేష్‌ మాస్టర్‌.. ప్రభాస్‌కి డ్యాన్స్‌ నేర్పించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిలో రాకేష్‌ మాస్టర్‌ గైడెన్స్‌లో.. శేఖర్‌ మాస్టర్‌తో కలిసి ప్రభాస్‌ డ్యాన్స్‌ నేర్చుకుంటున్నాడు. రాకేష్‌ మాస్టర్‌ మృతి నేపథ్యంలో ఈ ఫొటో వైరలవుతోంది. ప్రభాస్‌కే డ్యాన్స్‌ నేర్పిన రాకేష్‌ మాస్టర్‌.. పరిస్థితి ఎందుకు ఇలా మారింది.. అసలు ఆయన బ్యాగ్రౌండ్‌ ఏంటి అంటూ చర్చించుకుంటున్నారు నెటిజనులు.

కుటుంబ నేపథ్యం ఇది..

రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. వాళ్ళ అమ్మకు రాముడు, రామారావు అంటే చాలా ఇష్టమంట. అందుకే తన కొడుక్కి రామారావు అని పేరు పెట్టుకుంది. రాకేష్‌కి నలుగురు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు. రాకేష్‌ మాస్టర్‌.. చిన్నప్పటి నుంచు ముక్కు సూటి మనిషి. తప్పు జరిగితే సహించేవాడు కాదట. ఒకసారి వాళ్ళ అక్క పట్ల తప్పుగా ప్రవర్తించిన రిక్షావాడిని చితకొట్టాడట. ఇక డ్యాన్స్‌న్న కూడా ఆయనకు ఎంతో ఇష్టం. డప్పు శబ్దం వవినపడితే చాలు..అక్కడకు పోయి డ్యాన్స్‌ వేసేవాడట. సినిమాలు అంటే పిచ్చి. అందుకే సినిమా టికెట్‌ కొనడానికి కావాల్సిన డబ్బుల కోసం శవాల ముందు డాన్స్ చేసి, వచ్చిన చిల్లర పోగు చేసుకుని.. ఆ డబ్బులతో సినిమాలు చూసేవాడట. రోజు ఒక శవం లేస్తే.. బాగుంటుంది అనుకునేవాడట.

రాకేష్‌ మాస్టర్‌ టాలెంట్‌ చూసి సినిమాల్లో ప్రయత్నాలు చేయమని.. హీరోవి అవుతావని ఆయన తల్లిదండ్రులు సూచించారు. కానీ రాకేష్‌ మాస్టర్‌ మాత్రం.. తనలో హీరో అయ్యే లక్షణాలు లేవు.. డాన్స్ మాస్టర్ అవుతానని చెప్పేవాడట. చెప్పినట్లుగానే చెన్నై వెళ్లి కొన్నాళ్లు ప్రయత్నం చేశాడట. భరతనాట్యం నేర్చుకొని తిరుపతిలో డాన్స్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించాడు. అక్కడ రాకేష్‌ మాస్టర్‌ టాలెంట్‌ గురించి తెలిసినన ఓ వ్యక్తి.. ఆయనను సీనియర్ కొరియోగ్రాఫర్ ముక్కు రాజుకు పరిచయం చేశాడట. ఈ క్రమంలో రాకేష్‌ మాస్టర్‌.. సాగర సంగమం మూవీలోని కొన్ని డాన్స్ మూమెంట్స్ చేసి చూపించగా ముక్కురాజు ఆశ్చర్యపోయి.. తన వద్ద ఉన్న శిష్యులకు గురువుగా రామారావును పరిచయడం చేశాడట.

రౌడీల బెదిరింపులు..

రాకేష్‌ మాస్టర్‌కు వచ్చిన గుర్తింపు చూసి తట్టుకోలేకపోయిన వారు ఆయన మీద కక్ష సాధింపు చర్యలకు దిగారట. రౌడీలతో బెదిరించడం చేశారట. ఈ విషయం కాస్త ముక్కురాజుకు తెలియడంతో.. ఆయన నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో.. వాళ్లు నిన్ను బ్రతకనివ్వరని చెప్పాడట. దాంతో ఆయన తిరిగి హైదరాబాద్‌ వచ్చి.. అక్కడ ఒక ప్రముఖ వ్యక్తిని కలవగా.. ఆయన రాకేష్‌ మాస్టర్‌కు ఆశ్రయం ఇచ్చి.. ఇక్కడ డాన్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయించాడట. అలా రాకేష్‌ మాస్టర్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అనతి కాలంలోనే ఎంతో పాపులర్‌ అయ్యింది. రాకేష్‌ మాస్టర్‌కి కూడా మంచి గుర్తింపు వచ్చింది.

దాంతో.. అప్పుడే హీరోలుగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న ప్రభాస్, వేణు తొట్టెంపూడి రాకేష్ మాస్టర్ వద్ద డాన్స్ నేర్చుకున్నారు. ఆ పరిచయంతో వేణు తాను నటించిన చిరునవ్వుతో సినిమాలో ఓ పాటకు కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ ఇచ్చాడట. తర్వాత కృష్ణవంశీ, వైవిఎస్ చౌదరి వంటి డైరెక్టర్స్ అవకాశాలు ఇచ్చారట. అప్పటికే ఇండస్ట్రీలో రామారావు పేరుతో ఎంతో మంది కొరియోగ్రాఫర్స్ ఉండటంతో.. ఆయన తన పేరును రాకేష్ మాస్టర్ అని పేరు మార్చుకున్నాడట.

స్టార్ గా ఎదగాల్సిన రాకేష్ మాస్టర్‌.. ఇండస్ట్రీలో ఉండే వ్యక్తుల మనస్తత్వాలు, అక్కడ బతకగలిగే లౌక్యం తెలియక అవకాశాలు కోల్పోయాడు. కెరీర్‌లో కిందకు పడిపోయాడు. ఆయన ముక్కుసూటితనం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తనకు ఏదైనా విషయం నచ్చకపోతే.. తన ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరైనా సరే.. నచ్చని విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేవాడట. దాంతో పరిశ్రమ వర్గాలతో విబేధాలు తలెత్తాయి. ఈ కారణం చేతనే డ్యాన్స్‌ అసోసియేషన్‌ నుంచి బహిష్కరించబడ్డాడు. అలానే ఇండస్ట్రీకి చెందిన వారి గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. వివాదాలకు కేరాఫ్‌ అడ్రెస​్‌గా నిలిచాడు.

Show comments