సందీప్ వంగా కోసం ప్రభాస్ మారతాడా? ఆ సవాల్​ను డార్లింగ్ ఎలా అధిగమిస్తాడో?

Prabhas, Sandeep Reddy Vanga: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ‘కల్కి 2898 ఏడీ’ సక్సెస్ ఇచ్చిన జోష్​తో తన పైప్​లైన్​లో ఉన్న మూవీ షూటింగ్స్​లో ఎక్స్​ట్రా ఎనర్జీతో వర్క్ చేస్తున్నాడు.

Prabhas, Sandeep Reddy Vanga: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ‘కల్కి 2898 ఏడీ’ సక్సెస్ ఇచ్చిన జోష్​తో తన పైప్​లైన్​లో ఉన్న మూవీ షూటింగ్స్​లో ఎక్స్​ట్రా ఎనర్జీతో వర్క్ చేస్తున్నాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ‘కల్కి 2898 ఏడీ’ సక్సెస్ ఇచ్చిన జోష్​తో తన పైప్​లైన్​లో ఉన్న మూవీ షూటింగ్స్​లో ఎక్స్​ట్రా ఎనర్జీతో వర్క్ చేస్తున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్​’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు డార్లింగ్. ‘సలార్ 2’తో పాటు ‘కల్కి 2898 ఏడీ’ సెకండ్ పార్ట్ లైన్​లో ఉన్నయి. వీటితో పాటు సెట్స్​ మీదకు వెళ్లడానికి ముందే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ‘స్పిరిట్’ మూవీ పైప్​లైన్​లో ఉంది. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్​లో ఉన్న ఈ సినిమా గురించి బయటకు వస్తున్న ఒక్కో ఇంట్రెస్టింగ్ అప్​డేట్ చిత్రం మీద అంచనాలను ఆకాశానికి తగిలేలా చేస్తోంది. ఈ తరుణంలో ‘స్పిరిట్’కు సంబంధించి మరో విషయం బయటకు వచ్చింది. ప్రభాస్​కు ఛాలెంజ్ విసురుతున్న ఆ మ్యాటర్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

‘స్పిరిట్’ స్టోరీని కంప్లీట్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. డైలాగ్ వెర్షన్​ను పెండింగ్​లో పెట్టాడని వినిపిస్తోంది. తన స్టైల్ రైటింగ్​కు తగ్గట్లు ప్రభాస్ తనను తాను మార్చుకుంటాడా? అనే విషయం డైరెక్టర్​ను ఆలోచనల్లో పడేసిందట. తనకు తగ్గట్లు డార్లింగ్ మారతాడా? లేదా ఆయనకు సూట్ అయ్యేలా పొడి పొడి డైలాగ్స్​తో తాను రైటింగ్​ను మార్చుకోవాలా? అనే మీమాంసలో ఉన్నాడట సందీప్ వంగా. కెరీర్ బిగినింగ్ నుంచి డిఫరెంట్ మూవీస్​లో యాక్ట్ చేస్తూ ఆడియెన్స్​తో పాటు మూవీ లవర్స్​ మనసుల్ని దోచుకుంటున్న ప్రభాస్.. మొదట్నుంచి ఒక విషయంలో మాత్రం పెద్ద మార్పులు చేయలేదు. అదే డైలాగ్స్. పొడి పొడి డైలాగ్స్ చెబుతూ, ఎక్కువగా తన కటౌట్​తో మాట్లాడటం ప్రభాస్ స్టైల్.

Show comments