Prabhas: ప్రభాస్ మంచి మనసు.. ప్రతి ఏడాది 100 మంది విద్యార్థులకు!

Prabhas-Students School Fee: డార్లింగ్‌ ప్రభాస్‌ చేసే గుప్త దానాలకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఏటా వంద మంది విద్యార్థులను చదివిస్తున్నారట. ఆ వివరాలు..

Prabhas-Students School Fee: డార్లింగ్‌ ప్రభాస్‌ చేసే గుప్త దానాలకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఏటా వంద మంది విద్యార్థులను చదివిస్తున్నారట. ఆ వివరాలు..

డార్లింగ్‌ ప్రభాస్‌ ప్రస్తుతం కల్కి విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో హిట్టు కొట్టిన సినిమాగా కల్కి నిలిచింది. రికార్డుల మీద రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ఇప్పటికే 1000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. హాలీవుడ్‌ స్థాయిలో తెరకెక్కించారంటూ ప్రతి ఒక్కరు కల్కి టీమ్‌ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక డార్లింగ్‌తో పని చేసిన ప్రతి ఒక్కరు తనపై ప్రశంసలు కురిపిస్తారు. మరీ ముఖ్యంగా ఆయన పెట్టే భోజనం గురించి ప్రతి ఒక్కరు ప్రస్తావిస్తారు. వీటితో పాటు.. ప్రభాస్‌లో మరో కోణం కూడా ఉంది. అదే తన దాతృత్వం. అవును సమాజ సేవ, ఇతరులను ఆదుకోవడం వంటి విషయాల్లో ప్రభాస్‌ ఎప్పుడు ముందే ఉంటాడు. కానీ ఆయన చేసే దానాల గురించి పెద్దగా బయటకు రాదు.

కుడి చెత్తో చేసిన దానం.. ఎడమ చేసతికి తెలియకూడదు అనేది ప్రభాస్‌ సిద్ధాంతం. ఆయన చేసేవన్ని గుప్త దానాలే. ఇక తాజాగా కేరళ వయనాడ్‌ బాధితులకు భారీ విరాళం ఇచ్చి మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు డార్లింగ్‌. ఏకంగా 2 కోట్ల విరాళం ప్రకటించి నిజంగా రాజే అనిపించుకున్నాడు. విషయం తెలిసిన ప్రతి ఒక్కరు ప్రభాస్‌ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రభాస్‌ చేసే దానాలకు సంబంధించి మరో ఆసక్తికర అంశం తెర మీదకు వచ్చింది. ప్రతి ఏటా వంద మంది విద్యార్థులకు ఆయన స్కూల్‌ ఫీజులు కడుతున్నారట.

ప్రభాస్‌ ప్రతి ఏటా వంద మంది విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నారు. అంటే ఆ వంద మంది విద్యార్థుల ఫీజులను ప్రభాసే కడుతున్నాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఓ ప్రముఖ పాఠశాలలో చదువుతున్న దాదాపు వంద మంది పిల్లలకు ప్రభాస్‌ ప్రతి ఏటా ఫీజులు కడుతున్నారనే వార్త వెలుగులోకి వచ్చింది. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది అంటారు. మరి ఏటా వందలాది మంది విద్యార్థులకు ఫీజులు కడుతూ.. చదువు చెప్పిస్తోన్న ప్రభాస్‌ మనసు ఎంత గొప్పదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 10, 20 వేలు సాయం చేసి డప్పు కొట్టుకునే వాళ్లున్న ఈ రోజుల్లో ప్రతి ఏటా వంద మందికి లక్షల్లో ఫీజులు కడుతూ.. ఎక్కడా ప్రచారం చేసుకోని ప్రభాస్‌ని ఎంత పొగిడినా తక్కువే అంటున్నారు.

Show comments