ప్రభాస్ బుజ్జి ఎందుకంత స్పెషల్.. కారు ఫీచర్స్ తెలిస్తే అమ్మో అంటారు!

Prabhas.. Kalki 2898 AD.. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్నచిత్రం కల్కి 2898 AD. ఇందులో ప్రభాస్ బుజ్జి అనే కారును పరిచయం చేశాడు. మరీ ఈ కారు ఫ్యూచర్స్ ఏంటంటే..?

Prabhas.. Kalki 2898 AD.. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్నచిత్రం కల్కి 2898 AD. ఇందులో ప్రభాస్ బుజ్జి అనే కారును పరిచయం చేశాడు. మరీ ఈ కారు ఫ్యూచర్స్ ఏంటంటే..?

కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ డైలాగ్‌కు ఫర్ ఫెక్ట్ హీరో ప్రభాస్. సినిమా హిట్స్, ప్లాప్స్ కెరీర్‌పై ఏ మాత్రం ప్రభావితం చూపని నటుడు. బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ మాత్రమే గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్. గత ఏడాది సలార్ మూవీతో బాక్సాఫీసును ఊచకోత కోసిన కాటేరమ్మ కొడుకు.. ఇప్పుడు కల్కి అవతారంలో రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకుడిగా, అశ్వనీదత్ ప్రొడక్షన్ హౌస్‌లో మోస్ట్ ఎవటైడ్ మూవీగా రాబోతుంది. జూన్ 27న పాన్ ఇండియన్ భాషల్లోనే కాకుండా ఇతర లాంగ్వెజెస్‌లో కూడా రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లను షురూ చేసింది చిత్ర యూనిట్. కాగా, ఇందులో ఓ రోబో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. స్క్రాచ్ 4 పేరుతో బుజ్జిని ఇంటడ్రూస్ చేశారు. మే 22న బుజ్జి లాంచ్ ఈవెంట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించారు.

సినిమా తగ్గట్లు భారీ స్థాయిలో బుజ్జి లాంచ్ ఈవెంట్ జరిగింది. కాగా, గతంలో రోబో బుజ్జి బ్రెయిన్ పరిచయం చేయగా..తాజా ఈవెంట్‌లో బుజ్జి బాడీని ఇంట్రడ్యూస్ చేశారు. బుజ్జి కారులో వచ్చి మెస్మరైజ్ చేశాడు డార్లింగ్ ప్రభాస్. అతడి ఎంట్రీ ఎలివేషన్ చూసి అభిమానులు అరుపులు, కేకలతో ఆ ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. ‘ నీ టైం స్టార్ట్ అయ్యింది బుజ్జీ’ అంటూ ఓ స్పెషల్ కారును తీసుకువచ్చాడు. కారు చాలా డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుంది. రెగ్యులర్ కారుల్లా లేదు. ఓ హాలీవుడ్ మూవీల్లో వినియోగించే వెపన్స్, వెహికల్స్‌కు ఏ మాత్రం తీసిపోదు. బుజ్జి బాడీగా పేర్కొంటున్న ఈ కారు కోసమే రూ. 7 కోట్లు ఖర్చు పెట్టారట చిత్ర యూనిట్. అంత స్పెషల్ ఏంటబ్బా ఈ కారులో అనుకుంటున్నారా..?

ఇందులో ఫీచర్స్ చూస్తే.. ఇందులో రైట్ సైడ్ కారు టైర్ చూస్తే.. ఓ సగటు మనిషిని మించిపోయాలా డిజైన్ చేశారు. ఈ టైర్ పొడవు -6075 మిమీ, వెడల్పు-3380మిమీ,ఇక ఎత్తు-2186మిమీ. రిమ్ సైజ్-34.5 ఇంచెస్. ఈ కారును టైర్లను ప్రముఖ టైర్ల కంపెనీ సీయెట్ (CEAT) ప్రత్యేకంగా తయారు చేసింది. ఈ కారును మహేంద్రతో పాటు జేయం మోటార్స్ స్పెషల్‌గా రూపొందించింది. ఈ కారు వెయిట్ 6 టన్నులట. పవర్ 94 Kw, బ్యాటరీ 47 KWH అట. వెనుక వైపు ఓ పెద్ద టైర్ ఉంటుంది. ఇందులో హీరో తన కోసం ఈ స్పెషల్ కారును తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు కారు కోసం ఇంజనీర్లు బాగా కష్టపడ్డారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ సైతం ఈ సినిమా థియేటర్లలో చూసేందుకు తాను వెయిట్ చేస్తున్నట్లు చెప్పాడు. కాసేపే మాట్లాడినా..అభిమానులను అలరించాడు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.

Show comments