Venkateswarlu
పిండం సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ చిత్ర ట్రైలర్ కొద్దిరోజుల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పిండం సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ చిత్ర ట్రైలర్ కొద్దిరోజుల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Venkateswarlu
భాష ఎదైనా కావచ్చు.. హర్రర్ సినిమాలకు ఇప్పటికీ.. ఎప్పటికీ క్రేజ్ ఉంటుంది. కొంచెం భయపెట్టినా చాలు మూవీ జనాలకు నచ్చేస్తుంది. ఈ జోనర్‌లో వచ్చేవి తక్కువ సినిమాలే అయినా.. సక్సెస్ రేటు బాగా ఉంటుంది. వీటిలో కూడా దెయ్యాలకు సంబంధించిన చిత్రాలకు మంచి గిరాకీ ఉంటుంది. దెయ్యాల కథతో దర్శకుడు సాయికిరణ్ దైద ‘పిండం’ అనే మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం చిత్ర ట్రైలర్ విడుదల అయింది. ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. హర్రర్‌ను ఇష్టపడేవారిని బాగా ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌లో రెండు మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది.
ట్రైలర్ చాలా సింపుల్‌గా.. క్లీన్‌గా ఉంది. కథ కొత్తది కాకపోయినా కథనం విషయంలో దర్శకుడు సాయికిరణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఓ కుటుంబం కొత్తగా ఇంట్లోకి చేరటంతోటి అసలు కథ మొదలవుతుంది. ఆ ఇంట్లో చేరిన తర్వాత కుటుంబంలోని వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పాపలోకి దెయ్యం ప్రవేశిస్తుంది. వీటిని సాల్వ్ చేయడానికి దెయ్యాల గురించి తెలిసిన ఆమెను పిలిపిస్తారు. ఆమె వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నది ఒక దెయ్యం కాదు.. చాలా ఉన్నాయని తెలుస్తుంది.
ఇంతకీ ఆ ఇంట్లో దెయ్యాలుగా తిరుగుతున్నది ఎవరు? ఆ కుటుంబం దెయ్యాల నుంచి ఎలా బయటపడింది అనేది మిగిలిన కథ. ట్రైలర్‌ను కట్ చేసే విషయంలోనూ దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రయోగాత్వకంగా దాదాపు నాలుగు నిమిషాల ట్రైలర్‌ను వదిలాడు. నాలుగు నిమిషాలు బోరుకొట్టకుండా సాగుతుంది. సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే, సన్నివేశాలకు తగ్గట్టుగా.. భయం పుట్టిచ్చేట్టుగా ఉంటుంది.
మరో రెండు రోజుల్లో పిండం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 15వ తేదీనుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో శ్రీరామ్, ఖుషీ, ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తారగణం విషయానికి వస్తే.. సౌత్‌లో మంచి క్రేజ్ ఉన్న వారే. అయినప్పటికి పిండం మూవీకి అంత బజ్ రావటం లేదు. విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. అయినా సినిమా గురించి పెద్దగా టాక్ రావటం లేదు. ఇది ఇలాగే కొనసాగితే.. కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సినిమా విడుదలైన తర్వాత మౌత్ పబ్లిసిటీతో బజ్ వస్తే.. కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ, ఫస్ట్ వీక్ కలెక్షన్లపై మాత్రం ప్రభావం పడుతుంది. మరి, పిండం సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.