సైమా 2024 నామినేషన్స్ లో తెలుగు OTT హర్రర్ మూవీ.. ఏ కేటగిరీలో అంటే!

Pindam Movie Nominated In 2204 Siima Awards: సైమా 2024 అవార్డ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సైమా 2024 అవార్డ్స్ కు తెలుగు హర్రర్ మూవీ.. ఓ స్పెషల్ కేటగిరిలో నామినేట్ అయింది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

Pindam Movie Nominated In 2204 Siima Awards: సైమా 2024 అవార్డ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సైమా 2024 అవార్డ్స్ కు తెలుగు హర్రర్ మూవీ.. ఓ స్పెషల్ కేటగిరిలో నామినేట్ అయింది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం ఓటీటీ లలో హర్రర్ మూవీల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగులో కొత్త కంటెంట్ తో వస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో గత సంవత్సరం .. శ్రీరామ్ , ఖుషి రవి జంటగా నటించిన హర్రర్ థ్రిల్లర్.. “పిండం” మూవీ ఓటీటీ లో ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు సాయి కిరణ్ దైదా దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ నుంచి నటి నటుల పని తీరు వరకు ప్రతి ఒక్కటి ప్రేక్షకులను మెప్పించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ ను సాధించిన ఈ మూవీ ఓటీటీ లో కూడా అందరి మెప్పును పొందింది. ఇక ఇప్పుడు ఈ తెలుగు హర్రర్ మూవీ.. సైమా 2024 అవార్డ్స్ లో కూడా నామినేట్ అయింది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

సైమా 2024లో పిండం సినిమా.. బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ కేటగిరీలో నామినేట్ అయింది. దీనితో మూవీ మేకర్స్ ఈ విషయం పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు నిర్మాతగా యశ్వంత్ దగ్గుమాటి వ్యవహరించారు. తన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల నుంచి ఇలాంటి మెప్పును పొందడం విశేషం. అలాగే సినిమా పట్ల ఆయనకున్న తపనే ఇలాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు నామినేషన్ పొందేలా చేసిందని.. మూవీ మేకర్స్ తెలిపారు. ఇక నిర్మాత యశ్వంత్ విషయానికొస్తే.. అతను అమెరికాలోని కార్పొరేట్ రంగంలో.. ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ సమయంలోనే దర్శకుడు సాయి కిరణ్ తో పరిచయం ఏర్పడి పిండం మూవీకి నిర్మాతగా మారారు. ఇక ప్రతిష్టాత్మకమైన సైమా అవార్డ్స్ చిత్ర బృందానికి మరొక సినిమా తీసేందుకు.. కొత్త ఉత్సాహాన్ని అందిస్తుందని చెప్పి తీరాలి.

ఈ క్రమంలో ఇప్పటికే పిండం మూవీ దర్శకుడు.. సాయి కిరణ్ మరొక కొత్త మూవీకి రెడీ అవుతున్నట్లు.. కళాహీ మీడియా ప్రకటించింది. ఈ సినిమాను 2024 అయ్యేలోపు సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కథ కూడా లాక్ చేశారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, టెక్నీకల్ విభాగం టీమ్, ఇంకా ఈ మూవీకి సంబందించిన అప్ డేట్స్ గురించి.. మరిన్ని విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. ఇక ప్రస్తుతం పిండం మూవీ అమెజాన్ ప్రైమ్ , ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాకు ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో 7.7 రేటింగ్ దక్కించుకుంది. ఇప్పటివరకు ఈ మూవీని చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments