Venkateswarlu
లీసన్ పేరు గత కొద్దిరోజుల నుంచి డ్రగ్స్ కేసులో బాగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన కొంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తాజాగా, అనుమానాస్పద స్థితి కన్నుమూశారు.
లీసన్ పేరు గత కొద్దిరోజుల నుంచి డ్రగ్స్ కేసులో బాగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన కొంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తాజాగా, అనుమానాస్పద స్థితి కన్నుమూశారు.
Venkateswarlu
హాలీవుడ్ సినిమాలను ఎక్కువగా చూసే వారికి ‘పారసైట్’ గురించి తెలిసి ఉంటుంది. సౌత్ కొరియాకు చెందిన ఈ సినిమా ఆస్కార్ అవార్డుల్లో తన సత్తా చాటింది. 2019 మే 21న మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడింది. తర్వాత మే 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. బ్లాక్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి బాంగ్ జూన్ హో దర్శకత్వం వహించారు. క్వాక్ సిన్ ఈ, మూన్ యాంగ్ నో, బాంగ్ జూన్ హో, జాంగ్ యాంగ్ హ్వాన్, లీ సన్ క్యూన్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు.
సినిమా సక్సెస్ సాధించటమే కాదు.. అవార్డుల పంట కూడా పండించింది. ఈ మూవీకి ఏకంగా ఆరు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. బెస్ట్ పిశ్చర్, బెస్ట్ డైరెక్టర, బెస్ట్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాదు! పారసైట్ సినిమాలో నటించిన చాలా మందికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించింది. అలా గుర్తింపు తెచ్చుకున్న వారిలో లీ సన్ క్యూన్ కూడా ఒకరు. తాజాగా, లీసన్ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.
తర్వాత అది ఆత్మహత్యగా తేలింది. లీసన్ చనిపోయిన చోట ఓ సూసైడ్ నోట్ దొరకటంతో ఆయనది ఆత్మహత్య తేల్చారు. లీసన్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నది ఇంకా తెలియరాలేదు. లీసన్ రాసిన సూసైడ్ నోట్ అతడి భార్యకు దొరికింది. దీంతో భయభ్రాంతులకు గురైన ఆమె అతడి కోసం వెతకటం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో లీసన్ పార్కింగ్‌లోని కారులో అచేతనంగా పడి ఉండటం గుర్తించింది. ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లీసన్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇంట్లో సూసైడ్ నోట్ రాసి, బయటకు వెళ్లి అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా, లీసన్ 2001లో యాక్టింగ్ కెరీర్‌ను మొదలుపెట్టాడు. లవర్స్ అనే టీవీ షోలో నటించారు. ‘మేక్ ఇట్ బిగ్’ అనే మూవీతో వెండి తెరపైకి అడుగుపెట్టారు. సెంట్ ఆఫ్ లవ్, మై మదర్ ది మెర్మైడ్, లవ్ సో డివైన్, ఆర్ పాయింట్, అవర్ టౌన్, నైట్ అండ్‌డే, సాకా, రొమాంటిక్ ఐలాండ్, పాజు, పెట్టీ రొమాన్స్, హెల్ప్ లెస్ తదితర చిత్రాల్లో నటించారు. మరి, ఆస్కార్ సినిమా నటుడు లీసన్ ఆత్మహత్య చేసుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.