iDreamPost
android-app
ios-app

OTT Entertainment : రాధే శ్యామ్ టికెట్లు దొరక్కపోయినా నో టెన్షన్

OTT Entertainment : రాధే శ్యామ్ టికెట్లు దొరక్కపోయినా నో టెన్షన్

వచ్చే శుక్రవారం అంటే మార్చి 11 టాలీవుడ్ ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్న సినిమా రాధే శ్యామ్ ఒక్కటేనని ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లేదు. సరే మొదటి రోజే సగటు సినిమా అభిమానికి టికెట్లు దొరకడం అంత సులభం కాదు కాబట్టి ఒకవేళ చిక్కకపోతే ఎంటర్ టైన్ మెంట్ ఎలా అనే సంశయం అక్కర్లేదు. ఎందుకంటే అదే రోజు ఓటిటిలోనూ బోలెడంత వినోదం రెడీ అవుతోంది. థియేట్రికల్ రిలీజ్ కు కేవలం నెల రోజుల గ్యాప్ లోనే రవితేజ ‘ఖిలాడీ’ డిస్నీ హాట్ స్టార్ లో రాబోతోంది. మొన్న ఉన్నట్టుండి డేట్ ని ప్రకటించేశారు.  డిజాస్టర్ అయ్యింది కాబట్టి హాలు దాకా వెళ్లి చూసినవాళ్లు తక్కువ. సో వ్యూస్ పరంగా భారీ అంచనాలున్నాయి.

ఆహా నిర్మించిన ‘కుబూల్ హై’ 11నే స్ట్రీమింగ్ కానుంది. హైదరాబాద్ పాతబస్తీలో జరిగే హ్యూమన్ ట్రాఫికింగ్ ని తీసుకుని అల్లుకున్న కథగా ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. అరుదుగా అనిపించే సీరియస్ జానర్ ని టచ్ చేయడంతో రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ధనుష్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన ‘మారన్’ తెలుగు తమిళం మలయాళం కన్నడలో ఒకేసారి హాట్ స్టార్ లో రానుంది, జగమే తంత్రం తర్వాత రజని అల్లుడికి ఇది రెండో డైరెక్ట్ ఓటిటి మూవీ. ట్రైలర్ లో మంచి ఇంటెన్స్ సీరియస్ డ్రామా అనే ఇంప్రెషన్ అయితే కలిగించారు. సో అంచనాలు అందుకుంటే మాత్రం ఖిలాడీకి ధీటుగా మారన్ కూడా డిజిటల్ ఆడియన్స్ ని ఆకట్టుకోవచ్చు

దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ‘రౌడీ బాయ్స్’ జీ5లో సేమ్ డేట్ స్ట్రీమింగ్ కానుంది. పెద్దగా విజయం సాధించకపోయినా యాభై రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయడం గమనార్హం. దీనికి యూత్ లో మంచి బజ్ ఉంది కనక రెస్పాన్స్ బాగుండొచ్చు. అన్ని భాషలు చూసే వాళ్లకు తమిళం నుంచి సూపర్ శరణ్య-కడైసి వివసాయి, ఇంగ్లీష్ లో ది ఆడమ్ ప్రాజెక్ట్ – టర్నింగ్ రెడ్ – అప్లోడ్ సీజన్ 2 వస్తున్నాయి. సో రాధే శ్యామ్ చూసినా చూడకపోయినా ఇల్లు కదలకుండా దొరికే ఎంటర్ టైన్మెంట్ మార్చి 11న భారీగా ఉంది. ఇవి కాకుండా మరికొన్ని వెబ్ సిరీస్ లు, రెన్యూవల్స్ ఉన్నాయి. వెతికే ఓపిక టైం రెండూ ఉండాలే కానీ ఓటిటిలు దేనికీ లోటు రానివ్వడం లేదు

Also Read : Suriya : మాస్ ఎక్కువ వద్దంటున్న స్టార్ హీరో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి