ఆఖరికి నయన్ కూడా ఆ లిస్టులో చేరిపోయింది!

  • Author ajaykrishna Updated - 11:24 AM, Fri - 15 September 23
  • Author ajaykrishna Updated - 11:24 AM, Fri - 15 September 23
ఆఖరికి నయన్ కూడా ఆ లిస్టులో చేరిపోయింది!

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ ఫామ్ లో ఉన్నప్పుడే బిజినెస్ లోకి ఎంటర్ అవుతుంటారు. కెరీర్ ఆరంభంలో ఏవైతే డ్రీమ్స్ తో వస్తారో.. మనీ, కావాల్సినంత ఫేమ్ వచ్చాక ఆ వైపు అడుగులు వేస్తుంటారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ నయనతార కూడా అదే పని చేస్తోంది. నయనతార ఆల్రెడీ గతంలోనే బిజినెస్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. విగ్నేష్ శివన్ తో పెళ్లి తర్వాత.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించింది. అలాగే చెన్నైకి చెందిన పాపులర్ ఛాయ్ వాలా బ్రాండ్ లో భాగస్వామిగా చేరింది. ఇక నయన్ రాకతో.. భర్త విగ్నేష్ కూడా అందులో భాగం అయ్యాడు. మొత్తానికి ఇద్దరు కలిసి తమకు నచ్చిన బిజినెస్ లో పెట్టుబడులు పెడుతున్నారు.

కట్ చేస్తే.. నయనతార కొత్త బిజినెస్ మొదలు పెట్టింది. స్కిన్ కేర్ కి సంబంధించి సొంత ప్రోడక్ట్ ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. “9 స్కిన్” పేరుతో నయన్ బ్రాండ్ ని లాంచ్ చేయడం ఇప్పుడు కోలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియా వేదికగా.. ‘9స్కిన్ అఫిషియ‌ల్‌ ను గ‌ర్వంగా ప్ర‌క‌టిస్తున్నాను. సెల్ఫ్ కేర్ ఎంతో ముఖ్య‌మ‌ని నేను న‌మ్ముతాను. ఆరేళ్ల కృషి, ప్రేమ‌ను మీతో పంచుకోవ‌డం ఆనందంగా ఉంది. ఈ సెప్టెంబ‌ర్ 29 నుండి మా 9 స్కిన్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇకనుండి మా స్కిన్ కేర్ ప్రొడ‌క్ట్‌ ను మా ఆఫీషియల్ సైట్‌లో కొనుక్కోవచ్చు’ అని చెప్పుకొచ్చింది.

ఈ బిజినెస్ లో నయన్ తో పాటు విగ్నేష్ కూడా భాగమవ్వడం విశేషం. కాగా.. ఇప్పుడీ స్కిన్ కేర్ బిజినెస్ తో నయన్ కూడా ఆ లిస్ట్ లో చేరిపోయిందట. అదేం లిస్ట్ అంటే.. ఆల్రెడీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ తమ తమ సొంత బ్యూటీ ప్రోడక్ట్స్, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ని లాంచ్ చేసి బిజినెస్ లో రాణిస్తున్నారు. ఈ లిస్ట్ లో బాలీవుడ్ స్టార్ దీపికా, ప్రియాంక, కత్రినా, కృతి.. సౌత్ లో కాజల్, తమన్నా, రకుల్.. ఇలా చాలామంది వ్యాపారంలో ఉన్నారు. మరి నయన్ కూడా అదే రంగంలో అడుగు పెట్టేసరికి అభిమానులు నెట్టింట విష్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. నయన్ జవాన్ తో బాలీవుడ్ డెబ్యూ చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకొని బాక్సఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. మరి నయన్ కొత్త వ్యాపారం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments