70th National Film Awards Winners Prize Money: నేషనల్ అవార్డ్ విన్నర్స్​కు దక్కే ప్రైజ్​మనీ ఎంత? పురస్కారంతో పాటు ఏమేం ఇస్తారు?

నేషనల్ అవార్డ్ విన్నర్స్​కు దక్కే ప్రైజ్​మనీ ఎంత? పురస్కారంతో పాటు ఏమేం ఇస్తారు?

National Film Awards 2024 Prize Money: జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఇవాళ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవార్డు విన్నర్స్​కు దక్కే ప్రైజ్​మనీ ఎంతనేది ఇప్పుడు చూద్దాం..

National Film Awards 2024 Prize Money: జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఇవాళ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవార్డు విన్నర్స్​కు దక్కే ప్రైజ్​మనీ ఎంతనేది ఇప్పుడు చూద్దాం..

యాక్టర్స్, టెక్నీషియన్స్ టాలెంట్​ను గుర్తిస్తూ, వాళ్లను మరింత ఎంకరేజ్ చేస్తూ కొన్ని సంస్థలు అవార్డులు ఇస్తుంటాయి. ఈ మధ్య ఇలా పురస్కారాలు ఇచ్చేవాళ్లు మరింత పెరిగారు. అయితే ప్రభుత్వం ఇచ్చే అవార్డులకు మాత్రం విలువ, గౌరవం మాత్రం తగ్గలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పురస్కారాలకు మన దగ్గర చాలా రెస్పెక్ట్ ఇస్తారు. వాటిని అఛీవ్​మెంట్​గా భావిస్తారు. ఆయా అవార్డుల ప్రకటన సమయంలో చాలా ఆసక్తి నెలకొంటుంది. ఎవరెవరు ఏయే పురస్కారాలను దక్కించుకున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. ఇవాళ 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2’ బెస్ట్ తెలుగు ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది.

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి పురస్కారానికి ఎంపికయ్యాడు. నిత్యా మీనన్ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు. దీంతో వీళ్లను అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అదే టైమ్​లో అసలు నేషనల్ అవార్డులు గెలుచుకున్న వారికి ఏమేం ఇస్తారు? వాళ్లకు దక్కే ప్రైజ్​మనీ ఎంత? లాంటివి ఆరా తీసే పనిలో పడ్డారు. నేషనల్ అవార్డు నెగ్గిన వారికి పురస్కారంతో పాటు నగదు బహుమతిని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. అలాగే ప్రశంసా పత్రం కూడా ఇస్తుంది. జాతీయ చలనచిత్ర విజేతలకు స్వర్ణ కమలం, రజత కమలంతో పాటు నగదు బహుమతిని అందజేస్తారు. వాళ్ల ప్రతిభకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలను కూడా బహూకరిస్తారు. అయితే జ్యూరీ అభినందనలు అందుకున్న ఫిల్మ్స్​కు మాత్రం కేవలం సర్టిఫికేట్ మాత్రం దక్కుతుంది.

బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ కేటగిరీల్లో విజేతలకు రూ.3 లక్షల డబ్బును ఇస్తుంది ప్రభుత్వం. మిగిలిన విభాగాల్లో పురస్కారాలకు ఎంపికైన వారికి అవార్డు, ప్రశంసా పత్రంతో పాటు రూ.2 లక్షల నగదు లభిస్తుంది. ఉత్తమ నటుడిగా ఎంపికైన రిషబ్ శెట్టికి రూ.2 లక్షలు, ఉత్తమ నటిగా నిలిచిన నిత్యా మీనన్​, మానసి పరేఖ్​కు చెరో రూ.2 లక్షల ప్రైజ్​మనీ దక్కుతుంది. కాగా, తెలుగు నుంచి బెస్ట్ ఫిల్మ్​గా ఎంపికైన ‘కార్తికేయ 2’ డైరెక్టర్ చందు మొండేటి, హీరో నిఖిల్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఇది మీ శ్రమకు దక్కిన ఫలితమని ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో చందు మొండేటి ఇంట్రెస్టింగ్ అప్​డేట్ ఇచ్చారు. నాగచైతన్యతో తీస్తున్న ‘తండేల్’ ఫినిష్ అయ్యాక.. ‘కార్తికేయ 3’ని ప్రారంభిస్తానని చెప్పారు.

Show comments