ఇండస్ట్రీలో విషాదం.. మల్టీ స్టారర్ మూవీల దర్శకుడు ఇక లేరు

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ నెలలోనే టాలీవుడ్ సీనియర్ నటులు చంద్రమోహన్, ఈశ్వర రావు మరణించిన సంగతి విదితమే. తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ తుది శ్వాస విడిచారు. ఇప్పుడు మరొకరు..

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ నెలలోనే టాలీవుడ్ సీనియర్ నటులు చంద్రమోహన్, ఈశ్వర రావు మరణించిన సంగతి విదితమే. తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ తుది శ్వాస విడిచారు. ఇప్పుడు మరొకరు..

చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల ప్రారంభంలోనే పలువురు సినీ ప్రముఖులు తుది శ్వాస విడిచారు. ఎన్నో చిత్రాలతో అలరించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటుడు ఈశ్వరరావు మృతి చెందారన్న వార్త ఆలస్యంగా తెలిసింది. వెంటనే ప్రముఖ నటుడు చంద్ర మోహన్ అనారోగ్య సమస్యలతో అపోలో ఆసుపత్రిలో ఈ నెల 11న కన్నుమూశారు. ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీని విషాదంలో నింపింది. ఇంతలోనే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, ధూమ్ సిరీస్ చిత్రాల డైరెక్టర్ సంజయ్ గాధ్వీ మరణించిన సంగతి విదితమే. మలయాళ పరిశ్రమకు చెందిన వినోద్ థామస్ అనుమానాస్పద రీతిలో చనిపోయారన్న వార్త మాలీవుడ్ ఇండస్ట్రీని కలవరపాటుకు గురిచేసింది. తాజాగా సినీ పరిశ్రమకు చెందిన మరో దర్శకుడు ఇక లేరన్న న్యూస్ వచ్చింది.

ప్రముఖ దర్శక నిర్మాత రాజ్ కుమార్ కోహ్లి శుక్రవారం ఉదయం మరణించారు. ముంబైలో తన నివాసంలో గుండె పోటుతో మరణించారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. హిందీ బిగ్ బాస్ 7 ఫేమ్ కంటెస్టెంట్ అర్మాన్ కోహ్లీ.. ఇతడి కుమారుడే. రాజ్ కుమార్ మరణ వార్తను అర్మాన్ కోహ్లి స్నేహితుడు, ప్రచారకర్త విజయ్ గ్రోవర్ ధ్రువీకరించారు. ‘రాజ్ జీ ఉదయం 8 గంటలకు స్నానానికి బాత్రూంలోకి వెళ్లి.. ఎంత సేపటికీ బయటకు రాలేదు. తలుపు కొట్టినా.. ఉలుకు పలుకు లేకపోవడంతో వెంటనే కుమారుడు అర్మాన్ బాత్రూమ్ డోర్స్ పగులగొట్టాడు. అక్కడ అపస్మారక స్థితిలో తండ్రి పడి ఉండటం చూసి.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. గుండె పోటుతో చనిపోయినట్లు నిర్ధారించారు’ అని తెలిపారు.

రాజ్ కుమార్ అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్నారు. రీనా రాయ్, సునీల్ దత్, ఫిరోజ్ ఖాన్, సంజయ్ ఖాన్, రేఖ వంటి మల్టీసారర్లతో రూపొందించిన నాగిన్ సినిమాకు దర్శకుడు ఆయనే. అలాగే జానీ దుష్మన్, బీస్ సాల్ బాద్. దర్శకుడిగా 15కు పైగా చిత్రాలను తెరకెక్కించారు. అంతేకాకుండా నిర్మాతగా మారి పలు సినిమాలను తీశారు. హిందీ, పంజాబీ సినిమాలకు నిర్మాతగా మారారు. గోరా ఔర్ కాలా, డంకా, దుల్లా భట్టి, లుటేరా వంటి బాలీవుడ్ మూవీస్సే కాకుండా.. మెయిన్ జట్టీ పంజాబీ డీ, పింద్ డీ కుర్తీ, సప్నీ వంటి పంజాబీ చిత్రాలను నిర్మించారు. ఆయన భార్య నిషి కూడా నటేనని తెలుస్తోంది. వారి కుమారుడు అర్మాన్ కోహ్లి కూడా నటుడే.

Show comments