‘తండేల్’లో శ్రీకాకుళం యాసతో నాగచైతన్య.. అసలు తండేల్ అంటే ఎంటి?

Naga Chaitanya Tandelu Movie: అక్కినేని నాగచైతన్య మరో సహసం చేయబోతున్నాడు. ఏకంగా లుక్ పరంగానే కాకుండా యాసను కూడా మార్చేశాడు. పూర్తిగా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తూ తండేల్ మూవీతో రానున్నాడు.

Naga Chaitanya Tandelu Movie: అక్కినేని నాగచైతన్య మరో సహసం చేయబోతున్నాడు. ఏకంగా లుక్ పరంగానే కాకుండా యాసను కూడా మార్చేశాడు. పూర్తిగా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తూ తండేల్ మూవీతో రానున్నాడు.

చందూ మొండేటి, నాగ చైతన్య కాంబినేషన్ లో సాయి పల్లవి హీరోయిన్ గా, అల్లు అరవింద్ సమర్ఫణలో బన్నీవాసు నిర్మిస్తున్న తండేల్ సినిమా అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనప్రాయంగా ప్రారంభమైంది. నాగచైతన్యకు అత్యంత ముఖ్యలైన నాగార్జున, వెంకటేష్ ఇద్దరూ ముఖ్య అతిధులుగా వచ్చారు. ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరిగింది. చందు మొండేటి చెప్పిన కథాంశాన్ని మెచ్చుకుని, నచ్చుకున్న అల్లు అరవింద్ స్వయంగా తానే నాగ చైతన్య ఇంటికి వెళ్ళి మరీ ఒప్పించి డేట్స్ తీసుకోవడమే ఈ సినిమా వెనుక ఎక్సైట్ మెంట్. అయితే ఇప్పటి వరకు తండేల్ అనే మాట అసలు ఎవ్వరూ విని ఉండరు. తండేల్ అంటే ఏమిటని ఎవ్వరూ క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మాములుగా తండేల్ అంటే సముద్రవ్యాపార చేపల షిప్ కెప్టెన్. అంటే ఇది కంప్లీట్ గా సముద్రం, షిప్పులు ఈ నేపథ్యంలోనే కథ జరుగుతుందని ఊహించొచ్చు.

ఊహ మాత్రమే, కానీ నాగచైతన్యతో ముందుగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అంటే ఇంత వరకూ నాగచైతన్యని తెరమీద చూసిన లుక్స్ కి, ఈ పోస్టర్లో లుక్ కి చాలా తేడా ఉంది. అసలు ఎక్కడా పోలిక లేదని చెప్పాలి. చాలా రప్ గా గడ్డాలు, చేపలు పట్టేవాళ్ళు వేసుకుని దుమ్ము పట్టిపోయిన ఓ కలర్ కట్ బనియన్ ధరించి కనిపిస్తున్నాడు. ఇది మాములుగా నాగచైతన్య స్టైల్ కాదు. చాయ్ అంతా స్టయిల్ గా, సోఫిస్టికేటెడ్ గా, సింపుల్ గా కనిపించడాన్నే ఎక్కువగా ఇష్టపడతాడు. డైరెక్టర్స్ కూడా చాయ్ మీద ఇప్పటివరకూ దుస్సాహసాలు ఎవ్వరూ చేసిన దాఖలాలు లేవు. ఇదే మొదటిసారి. కాకపోతే సినిమా స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయిన రోజులివి. ఏదో ఒకటి సరికొత్తదనం లేకపోతే కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది.

అటువంటి ట్రెండ్ కి సరైన సమాధానం తండేల్. పైగా ఇందులో నాగచైతన్య శ్రీకాకుళం ప్రాంతంలో వాడుకలో ఉన్న యాసను, ఆ భాషను తండేల్ సినిమాలో ఉపయోగించడం మరో స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. దానికి చందూ మొండేటితో కలిసి నాగ చైతన్య కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడి లుక్స్ అండ్ లాంగ్వేజ్, దానితో పాటు అక్కడి మనుషుల ప్రవర్తన తెలుసుకున్నాడట. ఇక బాడీ లాంగ్వేజ్ కూడా పరిశీలించి ఓ స్పెషల్ ఎక్సర్ సైజుని పనిగా పెట్టుకుని మరీ షూటింగ్ మొదలెట్టారు టీం. వీటన్నిటికీ ప్రధానంగా పుష్ఫ సినిమా ప్రభావం బాగా ఉందని తెలుస్తోంది. పుష్ఫ రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ లో తయారైన సినిమా. అదే స్లాంగ్ అల్లు అర్జున్ చేత చెప్పించాడు దర్శకుడు సుకుమార్. అదెంత పెద్ద సక్సెస్ అనేది వేరేగా చెప్పక్కర్లేదు. అదే ఇన్సిపిరేషన్ తోనే తండేల్ కూడా తయారవుతోందని అనిపిస్తోంది. అంత పెద్ద హిట్ అయితే మరో రికార్డు పుడుతుంది.

Show comments