Venkateswarlu
ఏఎన్‌ఆర్ గారి ఫ్యామిలీనుంచి ఓ పది మంది ఉన్నారు. క్రిష్ణగారి ఫ్యామిలీనుంచి ఉన్నారు. నాయుడు గారి ఫ్యామిలీ ఉన్నారు. ఎమ్మెల్యే కొడుకు హీరో, ఎంపీ కొడుకు హీరో..
ఏఎన్‌ఆర్ గారి ఫ్యామిలీనుంచి ఓ పది మంది ఉన్నారు. క్రిష్ణగారి ఫ్యామిలీనుంచి ఉన్నారు. నాయుడు గారి ఫ్యామిలీ ఉన్నారు. ఎమ్మెల్యే కొడుకు హీరో, ఎంపీ కొడుకు హీరో..
Venkateswarlu
యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు యూట్యూబ్‌లో చిన్న ట్రావెలర్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన ఇప్పుడు తెలుగులో నెంబర్ వన్ ట్రావెల్ యూట్యూబర్ అయ్యారు. ఇప్పటికే 167కుపైగా దేశాలను చుట్టి రికార్డు సృష్టించారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇక, నెలకు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అన్వేష్ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతూ పోతోంది.
తాజాగా, ఆయనకు పదుల సంఖ్యలో సినిమా ఆఫర్లు వచ్చాయంట. కానీ, ఆయన ఆ ఆఫర్లను తిరస్కరించారంట. ఈ విషయాన్ని స్వయంగా అన్వేషే చెప్పుకొచ్చారు. తాజాగా, ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో.. ‘‘ కాదండి.. మనలో మన మాట నేను హీరోను ఏంటండి. పది అవకాశాలు వచ్చాయండి హీరో అవ్వమని. నాకు తెలీక అడుగుతాను మీకు హీరో అంతగా కావాలంటే.. చిరంజీవి గారి ఫ్యామిలీనుంచి పది మంది ఉన్నారు. ఎన్టీఆర్ గారి ఫ్యామిలీనుంచి ఓ పది మంది ఉన్నారు.
ఏఎన్‌ఆర్ గారి ఫ్యామిలీనుంచి ఓ పది మంది ఉన్నారు. క్రిష్ణగారి ఫ్యామిలీనుంచి ఉన్నారు. నాయుడు గారి ఫ్యామిలీ ఉన్నారు. ఎమ్మెల్యే కొడుకు హీరో, ఎంపీ కొడుకు హీరో.. ప్రొడ్యూసర్ కొడుకు హీరో.. డైరెక్టర్ కొడుకు హీరో.. యాక్టర్ కొడుకు హీరో.. హీరో కొడుకు హీరో.. హీరోయిన్ కొడుకు హీరో.. విలన్ కొడుకు హీరో.. ఆఖరికి యాంకర్ కొడుకు కూడా హీరో అయ్యాడు. తెలుగులో 4398 మంది హీరోలు ఉన్నారు. పాతవాళ్లు కొత్త వాళ్లు కలిపి. ఇంతమంది హీరోలను వదిలేసి నువ్వే హీరో అంటే..
నా ముఖం ఎప్పుడైనా అద్దంలో చూశారా? నాకు తెలీక అడుగుతాను.. నెత్తి మీద మూడు ఈకలు ఉంటాయి. ఐదు నెలల ప్రెగ్నెంట్.. ఇంత బొజ్జ ఉంటది. భూమికి మూడు అడుగులు ఉంటాను. మాటలు నత్తి ఉంటాయి. నేను హీరో అంటే నమ్మడానికి ఎలా ఉంటది. మీరే ఆలోచించండి’’ అంటూ ఆవేధన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. సినిమా ఆఫర్లు కాదంటున్న అన్వేష్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి, అన్వేష్ పది సినిమా అవకాశాలు వదులుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.