Jr NTR: వరద బాధితులకు Jr ఎన్టీఆర్ కోటి విరాళంపై మంత్రి నారా లోకేష్ స్పందన! ఏమన్నారంటే?

Nara Lokesh congratulated Jr NTR: వరద బాధితులకు Jr ఎన్టీఆర్ కోటి విరాళంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే?

Nara Lokesh congratulated Jr NTR: వరద బాధితులకు Jr ఎన్టీఆర్ కోటి విరాళంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే?

ఏపీ, తెలంగాణలో గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పల్లెలు, పట్టణాలు చెరువులను తలపిస్తున్నాయి. రవాణ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ప్రజలు నీళ్లు, ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ విపత్తును ఎదుర్కొవడంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరద బాధితుల కోసం టాలీవుడ్ ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ. కోటి రూపాయల భూరి విరాళం ప్రకటించాడు. ఏపీ, తెలంగాణకు చెరో రూ. 50 లక్షలు ప్రకటించాడు తారక్. ఇక ఈ విరాళంపై మంత్రి నారా లోకేష్  స్పందించారు.

రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. గత మూడు రోజులగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనావాసాలు అన్నీ జలమయం అయ్యాయి. విజయవాడ సిటీ వరద నీటిలో చిక్కుకుపోయింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని చేరవేస్తున్నారు. ఇంతటి భారీ విపత్తులో మేమున్నామంటూ వరద బాధితులకు అండగా నిలిచారు టాలీవుడ్ ప్రముఖులు. భారీ విరాళాలు ప్రకటించి తమ గొప్ప మనసును చాటుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ. కోటి విరాళం ప్రకటించాడు. ఏపీకి 50 లక్షలు, తెలంగాణకు 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించాడు. ఇక తారక్ ప్రకటించిన విరాళంపై ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “థ్యాంక్యూ తారక్.. వరదల వల్ల సంభవించిన ఈ నష్టం నుంచి కోలుకోవడానికి మీ సహాయం చాలా తోడ్పడుతుంది” అంటూ రాసుకొచ్చారు. అలాగే విరాళం ప్రకటించిన విశ్వక్ సేన్ తో సహా.. మిగతా వారికి కూడా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తారక్ గొప్ప మనసును అభినందించారు. మరి తారక్ విరాళంపై మంత్రి లోకేశ్ స్పందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments