‘మత్తు వదలరా 2’ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు!

Mathu Vadalara 2 Movie Trailer Out: చిన్న చిత్రంగా విడుదలైన ‘మత్తు వదలరా’ బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ఈ క్రైమ్ కామెడీ మూవీ ఊహించని రీతిలో వసూళ్లు సాధించింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ వచ్చేస్తోంది. ‘మత్తు వదలరా 2’ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది.

పెద్ద సినిమాలకే కాదు.. మంచి విజయం సాధించిన పలు చిన్న చిత్రాలకు కూడా సీక్వెల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆడియెన్స్​ను అలరించేందుకు వస్తోంది ‘మత్తు వదలరా 2’. ఫస్ట్ పార్ట్ బ్లాక్​బస్టర్​గా నిలవడంతో రెండో పార్ట్​ మీద కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. స్వర మాంత్రికుడు ఎంఎం కీరవాణి కుమారుడు శ్రీ సింహా, కమెడియన్ సత్య, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని రితేశ్ రానా డైరెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా ఈ ఫిల్మ్ ట్రైలర్​ను రిలీజ్ చేశారు. ఫుల్ కామెడీ, యాక్షన్ ప్యాక్డ్​గా ఉన్న ఈ ట్రైలర్ ఎంటర్​టైనింగ్​గా సాగుతూ ఆడియెన్స్​ను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సత్య పండించిన కామెడీ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తోంది.

Show comments