మూవీ లవర్స్‌కి భారీ షాక్‌.. వాటిపై కూడా పన్ను విధింపు

Karnataka-Cess, Movie Tickets, OTT Subscription Fees: మూవీలవర్స్‌కు భారీ షాక్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. వాటిపై కూడా పన్ను విధించాలని భావిస్తోంది. ఆ వివరాలు..

Karnataka-Cess, Movie Tickets, OTT Subscription Fees: మూవీలవర్స్‌కు భారీ షాక్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. వాటిపై కూడా పన్ను విధించాలని భావిస్తోంది. ఆ వివరాలు..

నేటి కాలంలో జనాలకు ఉన్న అతి ముఖ్యమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ సాధనం సినిమాలు అని చెప్పవచ్చు. స్మార్ట్‌ఫోన్‌, యూట్యూబ్‌, సోషల్‌ మీడియా వంటి ప్లాట్‌ఫామ్‌లు ఎన్ని వచ్చినా.. మెజారిటీ ప్రజలకు అతి ముఖ్యమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ సాధనం సినిమాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఒకప్పుడు మూవీలు చూడాలంటే.. థియేటర్‌కు వెళ్లాల్సిందే. అయితే ఇప్పుడు ఈ ఆలోచన మారింది. నేటి కాలంలో సినిమాలు చూడటం అంటే.. ఓటీటీల్లో చూడటమే అన్నట్లుగా పరిస్థితి మారింది. అయితే ఓటీటీల్లో ఉచితంగా చిత్రాలు చూడలేం.. అలానే థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడాలంటే టికెట్‌ కొనాల్సిందే. ఇప్పటికే ప్రభుత్వాలు కొత్త సినిమాల విడుదల వేళ టికెట్‌ ధరలు పెంచడానికి అనుమతి ఇస్తున్నాయి. ఇది చాలదన్నట్లు.. తాజాగా కొన్నింటిపై పన్ను విధింపుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఆ వివరాలు..

నేటి కాలంలో సినిమా చూడాలంటే ఒకటి థియేటర్‌కు వెళ్లాలి.. లేదంటే ఓటీటీల్లో చూడాలి. అయితే ఈ రెండింటిలో మూవీలు చూడటం అనేది ఉచితంగా జరిగే ప్రక్రియ కాదు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే టికెట్‌ కొనాలి.. ఓటీటీల్లో మూవీ వాచ్‌ చేయాలంటే.. ముందుగా సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలి. ఈ క్రమంలో తాజాగా కర్ణాటక ప్రభుత్వం.. సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌పై పన్ను విధించనుంది. ఈ రెండింటిపై 2 శాతం సెస్‌ వసూలు చేసే దిశగా ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. సినిమా, సాంస్కృతిక కళాకారుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కర్ణాటక సినీ, సాంస్కృతిక కార్యకర్తల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ధరలతో పాటు సినీ రంగంలో ఇతర ఆదాయ వనరులపై కూడా సెస్‌ విధించే అంశాన్ని ప్రతిపాదించింది. వీటిపై 1-2 శాతం సెస్‌ వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి మూడేళ్లకోసారి ఈ సెస్‌ రేటును సమీక్షించనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు, రాష్ట్రం పరిధిలో ప్రదర్శించే నాటకాలపైనా ఈ సెస్‌ను విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కార్మిక శాఖ కార్యదర్శి మహమ్మద్‌ మోహ్‌సిన్‌ వెల్లడించారు. ఈ పన్నును ఎలా వసూలు చేయాలన్న దానిపై ప్రస్తుతం ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు.

ఇక, సినీ, సాంస్కృతిక కార్యకర్తల సంక్షేమం కోసం ఏడుగురు సభ్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేసే అంశాన్ని కూడా బిల్లులో ప్రస్తావించారు. సెస్‌ కింద వచ్చే మొత్తాన్ని ఈ బోర్డుకు బదిలీ చేస్తారట. దీంతో పాటు ఆర్టిస్టుల ఆర్థిక భద్రత కోసం ఫండ్‌ను ఏర్పాటు చేయాలని సిద్ధరామయ్య సర్కారు భావిస్తోంది. ఇదే అమల్లోకి వస్తే.. మూవీ టికెట్‌ ధరలు, ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ రేట్లు పెరిగే ఛాన్స్‌ ఉంది. దీనిపై మూవీ లవర్స్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇక కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. అనేక సంచలన బిల్లులను ప్రవేశపెట్టందేకు రెడీ అవుతోంది. ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు, ఉద్యోగుల పని గంటల పెంపు వంటి అంశాలపై బిల్లులు చేసేందుకు రెడీ అవుతోన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశాలపై అధికారిక ప్రకటన రాకపోయినా సరే.. ఇప్పటికే పెద్ద ఎత్తున​ అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

Show comments