Kalki 2898 AD: కల్కి రేంజ్‌ మాములుగా లేదు కదా.. ఒక్క టికెట్‌ రూ.2300.. ఎక్కడంటే!

Kalki 2898 AD: భారీ అంచనాలు నెలకొని ఉన్న కల్కి చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మీద అంచనాలను దృష్టిలో పెట్టుకుని.. టికెట్‌ రేట్లను భారీగా పెంచారు. ఓ చోట అయితే ఏకంగా ఒక్క టికెట్‌ను 2300కు అమ్మారు. ఆ వివరాలు..

Kalki 2898 AD: భారీ అంచనాలు నెలకొని ఉన్న కల్కి చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మీద అంచనాలను దృష్టిలో పెట్టుకుని.. టికెట్‌ రేట్లను భారీగా పెంచారు. ఓ చోట అయితే ఏకంగా ఒక్క టికెట్‌ను 2300కు అమ్మారు. ఆ వివరాలు..

గత ఐదేళ్లుగా కల్కి పేరు సినీ ఇండస్ట్రీని ఊపేస్తుంది. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.. తన మూడో చిత్రంగా ప్రభాస్‌ లాంటి స్టార్‌ హీరోను ఎంచుకోవడం.. పైగా ఆ సినిమాలో నటించేందుకు దిగ్గజాలైన అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ అంగీకరించడం అప్పట్లో సంచలనమే సృష్టించింది. కల్కి నాగ్‌ అశ్విన్‌ కెరీర్‌లో మూడో చిత్రం. కేవలం రెండు సినిమాలు చేసిన దర్శకుడిని వీరంతా నమ్మడం ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేసింది. అయితే కల్కిలో ప్రతి ఒక్కరు చూసింది కథను కానీ.. దర్శకుడిని కాదు. అలా నాలుగున్నరేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత నేడు అనగా జూన్‌ 27, గురువారం నాడు కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక నెల రోజుల నుంచి దేశంలో ఎక్కడ చూసిన కల్కి పేరే వినిపిస్తోంది. బుజ్జి కారు పరిచయం నుంచి.. సినిమా రిలీజ్‌ ముందు వరకు కూడా చిత్ర బృందం భారీ ఎత్తున ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహించి.. కల్కి మీద ఓ రేంజ్‌లో అంచనాలు పెంచాకె. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో కల్కి రికార్డులు క్రియేట్‌ చేసింది. బుక్‌ మై షోలో కల్కి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభమైన గంటలోపే సుమారు 70 వేల టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాంటే.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే కల్కి క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. కొన్ని చోట్ల భారీ రేట్లకు టికెట్లను అమ్ముతూ.. దోపిడికి పాల్పడుతున్నారు. ఇక దేశంలోని ఒక థియేటర్‌లో కల్కి టికెట్‌కు అత్యధిక రేటు వసూలు చేస్తున్నారు. ఆ థియేటర్‌లో ఒక్క టికెట్‌ ధర ఏకంగా 2300 రూపాయలు కావడం గమనార్హం. ఇంతకు ఆ థియేటర్‌ ఏది.. ఎక్కడుందంటే..

ముంబై మైనస్‌ ఐనాక్స్‌లోని జియో వరల్డ్‌ ప్లాజాలో కల్కి మూవీ ఒక్కో టికెట్‌ను 2300 రూపాయలకు అమ్మినట్లు సమాచారం. ఒక్క టికెట్‌ ధర అంతనా అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల‌లో సైతం క‌ల్కి టిక్కెట్స్‌ ధరని భారీగా పెంచుకునేందుకు రెండు ప్రభుత్వాలు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణలో సైతం కల్కి టికెట్లను భారీ రేట్ల‌కి అమ్ముతున్న‌ట్టుగా తెలుస్తుంది. ఇక కొన్ని నగరాల్లో మల్టీఫ్లెక్స్‌లలో కల్కి ఒక్కో టికెట్‌ ధర రూ.400 నుండి రూ.2000 పైనే రేట్లు ఉండగా.. హైదరాబాద్‌లోని సింగిల్ థియేటర్స్‌లో సైతం భారీ రేటుకే విక్రయిస్తుండటం గమనార్హం.

Show comments