Devara Movie: ‘దేవర’ మూవీ రన్​టైమ్ ఇదే.. NTR రిస్క్ చేస్తున్నాడా?

Devara Movie Runtime Locked: మ్యాన్ ఆఫ్​ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ రిలీజ్​కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 27వ తేదీన మూవీ విడుదల కానుంది. తాజాగా ఈ ఫిల్మ్ రన్ టైమ్ లాక్ అయింది.

Devara Movie Runtime Locked: మ్యాన్ ఆఫ్​ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ రిలీజ్​కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 27వ తేదీన మూవీ విడుదల కానుంది. తాజాగా ఈ ఫిల్మ్ రన్ టైమ్ లాక్ అయింది.

మ్యాన్ ఆఫ్​ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ రిలీజ్​కు రెడీ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, సాంగ్స్ వచ్చి మంచి అప్లాజ్ అందుకున్నాయి. రీసెంట్​గా రిలీజ్ అయిన ట్రైలర్​కు కూడా సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. ఆల్రెడీ ఎక్స్​పెక్టేషన్స్ ఆకాశాన్ని అందుతుండగా.. ట్రైలర్​తో అది నెక్స్ట్ లెవల్​కు వెళ్లిపోయింది. ఈ తరుణంలో మూవీ రన్​టైమ్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ‘దేవర’ రన్ టైమ్ లాక్ అయింది. సెన్సార్ పూర్తి చేసుకున్న తారక్ ఫిల్మ్ రన్​టైమ్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్​టైనర్ ఎక్కువ రన్​టైమ్​తోనే వస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో అసలు ‘దేవర’ రన్​టైమ్ ఎంత? సెన్సార్ విశేషాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

‘దేవర’ ఫిల్మ్ సెన్సార్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ చిత్రం నిడివి 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు. దాదాపుగా మూడు గంటల రన్​టైమ్ ఉండనుంది. మూడు గంటలు అంటే తారక్-కొరటాల రిస్క్ చేస్తున్నారా? అంతసేపు ఆడియెన్స్​ను సీట్లకు కట్టిపడేయాలంటే మూవీ నెక్స్ట్ లెవల్​లో ఉండాలని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. అయితే సాధారణంగా పెద్ద సినిమాలు కాస్త ఎక్కువ నిడివితోనే వస్తుంటాయి. ఆ లెక్కన చూసుకుంటే ‘దేవర’ రన్​టైమ్ కామన్ అనిపిస్తుంది. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్​లు అధికంగా ఉండటం, స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ నిడివి అవసరమని మేకర్స్ నిర్ణయించుకున్నారని సమాచారం. మరి.. ‘దేవర’ రన్​టైమ్​ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments