కొమురం భీమ్ కి అవార్డు.. ఎన్టీఆర్ భావోద్వేగం! స్పీచ్ వైరల్!

  • Author ajaykrishna Updated - 04:23 PM, Sat - 16 September 23
  • Author ajaykrishna Updated - 04:23 PM, Sat - 16 September 23
కొమురం భీమ్ కి అవార్డు.. ఎన్టీఆర్ భావోద్వేగం! స్పీచ్ వైరల్!

సౌత్ ఇండియన్ సినిమాలకు సంబంధించి సైమా అవార్డుల వేడుకలు ప్రస్తుతం దుబాయ్ లో ఘనంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 15న మొదలైన ఈ వేడుకలలో.. మొదటి రోజు టాలీవుడ్, శాండల్ వుడ్స్ కి సంబంధించి అవార్డులు ప్రదానం చేశారు. కాగా.. 11వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ సైమా అవార్డులలో ఈసారి వరల్డ్ వైడ్ షేక్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా అత్యధిక అవార్డులు కైవసం చేసుకోగా.. సీతారామం ఆ తర్వాత స్థానంలో నిలిచింది. అయితే.. ఆర్ఆర్ఆర్ కి బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ లిరిసిస్ట్ లతో పాటు బెస్ట్ యాక్టర్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని అవార్డు వరించింది.

దీంతో వేడుకకు హాజరైన ఎన్టీఆర్.. స్టైలిష్ లుక్ లో స్టేజ్ పై కనిపించడం అందరిని సర్ప్రైజ్ చేస్తోంది. కాగా.. ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ పోషించిన కొమురం భీమ్ పాత్ర ఎంత హైలైట్ అయ్యిందో తెలిసిందే. ఆ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ ఇన్నోసెంట్ బిహేవియర్ తో పాటు మాస్ వెరీయేషన్స్ కూడా వరల్డ్ వైడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ నటనకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు రావడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ సందర్బంగా సైమా స్టేజ్ పై అవార్డు అందుకున్న అనంతరం.. ఎన్టీఆర్ మాట్లాడిన ఎమోషనల్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సందర్బంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “నా ఒడిదుడుకులలో.. నేను కింద పడ్డప్పుడల్లా.. నన్ను పట్టుకొని పైకి లేపినందుకు, నా కళ్ల వెంట వచ్చిన ప్రతీ నీటి చుక్కకు మీరు కూడా బాధ పడినందుకు.. నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు నవ్వినందుకు.. నా అభిమాన సోదరులందరికి పాదాభివందనాలు చేస్తున్నాను” అని ఫ్యాన్స్ గురించి భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ స్పీచ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎన్టీఆర్ ఎప్పుడు ఏ స్టేజ్ పై నిలబడినా తన ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు తెలపడం మర్చిపోడు.. ఈ విషయాన్నీ గుర్తు చేసుకుంటూ ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. మరి ఎన్టీఆర్ కి సైమా అవార్డు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments