Devara: దేవర రన్ టైమ్ ను ఇంకా తగ్గించారా? సెన్సార్ తర్వాత కూడా సీన్స్ కట్?

Devara Movie Run Time Reduced by 7 Minutes: రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్న టైమ్ లో దేవర రన్ టైమ్ ఇంకాస్త తగ్గించినట్లుగా తెలుస్తోంది. సెన్సార్ పూర్తి అయిన తర్వాత కూడా సీన్స్ కట్ చేసినట్లు సమాచారం.

Devara Movie Run Time Reduced by 7 Minutes: రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్న టైమ్ లో దేవర రన్ టైమ్ ఇంకాస్త తగ్గించినట్లుగా తెలుస్తోంది. సెన్సార్ పూర్తి అయిన తర్వాత కూడా సీన్స్ కట్ చేసినట్లు సమాచారం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన కంప్లీట్ రా అండ్ రస్టిక్ మూవీ ‘దేవర’ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన రెండు ట్రైలర్స్ కూడా అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. తారక్ ప్రమోషన్ల బాధ్యతలను తన భుజ స్కంధాలపై మోస్తున్నాడు. అయితే దేవర విషయంలో మెుదటి నుంచి రన్ టైమ్ పై ఇటు ఫ్యాన్స్ లో అటు సినీ విశ్లేషకుల్లో ఓ టెన్షన్ ఉండేది. రన్ టైమ్ మూడు గంటలు ఉందని, దాంతో వర్కౌట్ అవుతుందా? అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో దేవర రన్ టైమ్ ను ఇంకాస్త తగ్గించినట్లుగా తెలుస్తోంది.

దేవర మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల నిడివితో ఉన్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు సెన్సార్ పూర్తి చేసుకున్న తర్వాత కూడా మూవీ నుంచి కొన్ని సీన్స్ కట్ చేసినట్లుగా సమాచారం. దాదాపు 7 నిమిషాల సీన్లను ట్రిమ్ చేసినట్టు సమాచారం. దాంతో మూవీ రన్ టైమ్ ఇంకాస్త తగ్గినట్లు అయ్యింది. ఇక యాడ్స్ అన్నీ తీసేస్తే.. సినిమా రన్ టైమ్ 2 గంటల 42 నిమిషాలు వస్తుంది. తారక్ ఫ్యాన్స్ కు ఇది కొంత ఊరటను ఇస్తోంది. ఇక మెుదటి నుంచి దేవర నిడివిపై అందరికి సందేహాలు ఉన్నాయి. ఇంత లాంగ్ రన్ లో ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టడం అంటే కత్తిమీదసామే. ఇక ఇది దృష్టిలో పెట్టుకునే మేకర్స్ పక్కా ప్లానింగ్ తో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే ముందు జాగ్రత్తలు గట్టిగానే తీసుకుంటోంది.

అయితే సెన్సార్ తర్వాత కూడా సీన్స్ కట్ చేయడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా.. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమాల విషయంలో రన్ టైమ్ గురించి విపరీతమైన చర్చలు నడిచాయి. దాంతో రిస్క్ తీసుకోకపోవడమే మంచిదనే నిర్ణయానికి దేవర మేకర్స్ వచ్చినట్లున్నారు. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి. ఇక ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అలాగే బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్ ఇచ్చిన సెన్సేషనల్ మ్యూజిక్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలియనిది కాదు. మరి సెన్సార్ కంప్లీట్ అయిన తర్వాత కూడా దేవరలో సీన్స్ కట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments