Somesekhar
Devara movie break even before release in overseas: తాజాగా దేవరకు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. రిలీజ్ కు ముందే బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా దేవర ప్రభంజనం సృష్టించబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
Devara movie break even before release in overseas: తాజాగా దేవరకు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. రిలీజ్ కు ముందే బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా దేవర ప్రభంజనం సృష్టించబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
దేవర.. దేవర.. ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా గానీ వినిపించే ఒకే ఒక్క పేరు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇక ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లు కూడా అభిమానులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. దాంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆ అంచనాలను మరింత పెంచుతూ.. మేకర్స్ ప్రమోషన్స్ ను చేపట్టారు. ఇదిలా ఉండగా.. తాజాగా దేవరకు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. రిలీజ్ కు ముందే బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా దేవర ప్రభంజనం సృష్టించబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ప్రెస్టిజీయస్ మూవీ దేవర. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక గత కొన్ని రోజులుగా ఇండియాలో ఎక్కడ చూసినా.. దేవర మ్యానియానే కనిపిస్తోంది. దాంతో ఈసారి తారక్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి మరీ చెబుతున్నారు. అందుకు తగ్గట్లే రిలీజ్ అయిన రెండు ట్రైలర్లు కూడా ఉన్నాయి. కాగా.. దేవర మరో క్రేజీ రికార్డుకు దగ్గరలో ఉన్నాడు. యూఎస్ లో దేవర మూవీని ప్రత్యంగిరా మూవీస్ అండ్ హంసిని ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. రూ. 26 కోట్లకు ఈ సినిమా రైట్స్ ను ఈ సంస్థలు దక్కించుకున్నాయి.
అయితే తొలి నుంచి దేవరకు ఓవర్సీస్ లో భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే రూ. 21 కోట్ల రూపాయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. విడుదలకు ఇంకా మూడు రోజుల సమయం ఉండటంతో.. రిలీజ్ కు ముందే ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దాంతో విడుదలకు ముందే బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా దేవర సెన్సేషనల్ రికార్డును నెలకొల్పబోతోంది. అటు బయ్యర్లకు సైతం లాభాలు అందించబోతున్నాడు దేవర. ఇక ఇప్పటికే 60 వేల టికెట్లు బుక్ అయ్యి రికార్డు సృష్టించింది. తారక్ ప్రభంజనాన్ని చూసి దేశం మెుత్తం సంభ్రమాశ్చర్యాలకు గురౌతోంది. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో దేవరను సితారా ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత నాగవంశీ విడుదల చేస్తున్నారు. హిందీలో కరణ్ జోహర్ రిలీజ్ చేస్తున్నాడు. వరల్డ్ వైడ్ గా రూ. 180 కోట్లకు పైగా ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది దేవర. మరి విడుదలకు ముందే ఓవర్సిస్ లో బ్రేక్ ఈవెన్ దిశగా సాగుతున్న దేవరపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.