Dharani
Dharani
జేడీ చక్రవర్తి.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా రకరకాల పాత్రల్లో నటించి.. తెలుగు ప్రేక్షకులను అలరించాడు. రామ్ గోపాల్ వర్మ తొలిసారి డైరెక్షన్ చేసి శివ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు జేడీ చక్రవర్తి. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో.. ఆ తర్వాత ఆయనకు తెలుగు, ఇతర భాషల్లో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో కొన్నాళ్ల పాటు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్‌గా నటించాడు. ఆ తర్వాత వన్ బై టూ, మనీ మనీ, గులాబీ సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకుడుగా కూడా మారి కొన్ని చిత్రాలు తెరకెక్కించాడు. ప్రస్తుతం దయ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో తాజాగా జేడీ చక్రవర్తి ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు.
కొన్నాళ్ల క్రితం తనపై విష ప్రయోగం జరిగిందని.. 8-12 నెలల పాటు తనకు స్లో పాయిజన్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. తనపై విష ప్రయోగం చేసిన వ్యక్తి పేరు, దేశం, జెండర్ వివరాలు మాత్రం వెల్లడించలేను అన్నాడు. పైగా ఈ విషయం తనతో పాటు మరో ఇద్దరు, ముగ్గరికి మాత్రమే తెలుసు అన్నాడు జేడీ చక్రవర్తి. ‘‘ఒక సారి నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. మద్యం, సిగరెట్లు, డ్రగ్స్ తీసుకోను. అలాంటి నాకు ఈ సమస్య ఎందుకు వచ్చిందో అర్ధం కాలేదు. ఎందరో డాక్టర్లను కలిశాను. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఒకానొక సమయలో అసలు ఊపిరి పీల్చుకోలేకపోయాను’’ అని చెప్పుకొచ్చాడు.
‘‘డాక్టర్లకు నా సమస్య ఏంటో అర్దం కాలేదు. నేను చనిపోతానని భావించారు. ఆ సమయంలో నా స్నేహితుడు తనకు తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆయన పేరు నాగార్జున. ఒక నాగార్జున రీల్ లైఫ్ ఇస్తే.. మరో డాక్టర్ నాకు జీవితం ఇచ్చాడు. ఆయన నాకు కొన్ని ప్రత్యేకమైన టెస్ట్‌లు చేశారు. వాటిల్లో ఏం తేలింది అంటే.. గత కొన్ని నెలలుగా నాకు స్లో పాయిజన్ ఇస్తున్నారని.. కొన్ని రోజులైతే చనిపోయేవాడిని అని.. పోస్ట్‌మార్టంలో కూడా దీని గురించి ఏం తెలిసేది కాదని అన్నాడు. అప్పుడు నాకు సడెన్‌గా స్ట్రైక్ అయ్యింది. ఈ పని ఎవరు చేశారో అర్ధం అయ్యింది. ఆ వ్యక్తి.. గత కొన్ని నెలలుగా ఆరోగ్యానికి మంచిది అని చెప్పి ఇస్తున్న.. కషాయంలో పాయిజన్ కలిపి ఇస్తుంది అని నాకు అర్థం అయ్యింది. నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు కనుక నా బాడీ త్వరగా స్లో పాయిజన్‌ను రిసీవ్ చేసుకుంది. ఆ తర్వాత కోలుకున్నాను. నిజంగా నాకిది పునర్జన్మే’’ అని చెప్పుకొచ్చాడు