సినీ ఇండస్ట్రీకి మరో గౌరవం..ఆస్కార్ ప్రోగ్రామ్ కి ఎంపికైన సినిమాటో గ్రాఫర్!

Bengaluru Cinematographer Nethra: ఆస్కార్ అవార్డు కల అనేది ఆర్ఆర్ఆర్ సినిమాతో నెరవేరింది. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు లభించింది. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ యువతి ఆస్కార్ రేంజ్ వరకు వెళ్లింది.

Bengaluru Cinematographer Nethra: ఆస్కార్ అవార్డు కల అనేది ఆర్ఆర్ఆర్ సినిమాతో నెరవేరింది. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు లభించింది. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ యువతి ఆస్కార్ రేంజ్ వరకు వెళ్లింది.

ఆస్కార్ అవార్డు గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ అవార్డును గెల్చుకోవడం ప్రతి ఒక్కరిక ఓ అచివ్మెంట్ గా ఉంటుంది.  గత కొన్ని సంవత్సరాలుగా మన ఇండియన్ సినిమాలకు ఆస్కార్ అవార్డులు ఆమడ దూరంలో ఉండేవి. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా దీన్ని బ్రేక్ చేసింది. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు గెల్చి చరిత్ర సృష్టించింది.  ఈ సినిమా ఆస్కార్ అవార్డు గెల్చిన తరువాత హాలీవుడ్ సైతం ఇండియన్ సినిమాల వైపు చూస్తుంది. అంతేకాక అనేక ఇండియన్ సినిమాలు  కూడా ఆస్కార్ నామినేషన్స్  వరకు వెళ్తున్నాయి. ఇది ఇలా ఉంటే.. ఇండియన్ లేడీ సినిమాటో గ్రాఫర్ కూడా ఆస్కార్ అకాడమీ లో ఓ అరుదైన గౌరవం పొందింది. మరి.. ఆమె ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఆస్కార్ అవార్డు కల అనేది ఆర్ఆర్ఆర్ సినిమాతో నెరవేరింది. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు లభించింది. ఇలా ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఆర్ఆర్ఆర్ సినిమా చరిత్ర సృష్టించింది. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో  పలు ఇండియన్ సినిమాలు ఆస్కార్ నామినేషన్ల వరకు వెళ్లాయి. ఆస్కార్ అవార్డుతో పాటు  దానికి సంబంధించిన ఇతర అంశాలను మన ఇండియన్స్ సత్తాచాటుతున్నారు. ఆస్కార్ చెందిన వివిధ విభాగాల్లో భారతీయులు సత్తాచాటుతున్నారు. అలానే బెంగళూరుకు చెందిన ఓ లేడీ సినిమాటో గ్రాఫర్ ఇప్పుడు  ఓ అరుదైన అవకాశం పొందంది. ఆస్కార్ అకాడమీ గోల్డ్  రైజింగ్ ప్రోగ్రామ్ కి ఆమె ఎంపికైంది.

బెంగళూరుకి చెందిన నేత్ర గురురాజ్ అనే యువతి ఆస్కార్ అకాడమీ గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్ కి ఎంపికైంది. ఈమె ప్రస్తుతం  అమెరికాలోని లాజ్ ఏంజెల్స్‌లో ఉంటోంది. నేత్ర స్వతహాగా రైటర్, డ్యాన్సింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్ డిజైన్ వంటి వివిధ విభాగాల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ఇక సినిమాటోగ్రపీఅంటే నేత్రకు చాలా ఇష్టం. అందుకే కొన్నాళ్ల ముందు సినిమాటోగ్రఫీలో మాస్టర్స్ చేసేందుకు లాస్ ఏంజెల్స్ వెళ్లింది. ఇటీవలే నేత్ర ఓ షార్ట్ ఫిల్మ్ తీసింది. ఈమె తీసిన ‘జాస్మిన్ ఫ్లవర్స్’ షార్ట్ ఫిల్మ్ కూడా పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పురస్కారాలను గెల్చుకుంది. ఈ క్రమంలోనే నేత్ర మరో అరుదైన ఛాన్స్ ను పొందింది.

ఆస్కార్ అకాడమీ గోల్డ్ రైజింగ్ ప్రోగ్రమ్ కి నేత్ర ఎంపికైంది. ఇందులో సెలక్ట్ కావడం అంటే అంత ఆషామాషీ కాదు. వివిధ వడపోతాల అనంతరం ఈ ప్రోగ్రామ్ కి ఎంపిక చేస్తారు. అలా ప్రపంచం వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఈ ప్రోగ్రామ్‌కి ఎంపికైన యువ సినిమాటోగ్రాఫర్స్.. 2 నెలల పాటు అకాడమీ ఆధ్వర్యంలో నిపుణుల దగ్గర నుంచి మెలకువలు నేర్చుకుంటారు. ఇలాంటి అరుదైన గొప్ప అవకాశం కోసం మన దేశానికి చెందిన అమ్మాయి ఎంపిక కావడం విశేషం. ఆమెకు పలువురు సినీ ప్రముఖులు విషేష్ సైతం చెబుతున్నారు. మరి.. ఇండియన్ లేడీ పొందిన ఈ అరుదైన అవకాశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments