P Krishna
ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే చిన్న సినిమా అయినా పెద్ద హిట్ చేస్తారని ‘హనుమాన్’ మూవీ మరోసారి రుజువు చేసింది. సంక్రాంతి కానుకగా పెద్ద హీరో సినిమాలతో రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ప్రభంజనం సృష్టిస్తుంది.
ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే చిన్న సినిమా అయినా పెద్ద హిట్ చేస్తారని ‘హనుమాన్’ మూవీ మరోసారి రుజువు చేసింది. సంక్రాంతి కానుకగా పెద్ద హీరో సినిమాలతో రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ప్రభంజనం సృష్టిస్తుంది.
P Krishna
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా స్టార్ హీరోల సినిమాలతో పాటు అప్ కమింగ్ యంగ్ హీరో మూవీ కూడా రిలీజ్ అయ్యింది. మహేష్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేష్ ‘సైంధవ్’, నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ మూవీస్ తో పాటు టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ హీరో తేజా సజ్జా నటించిన ‘హనుమాన్’ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే హనుమాన్ మూవీకి రిలీజ్ అయిన మొదటి రోజే సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఇంకేముంది బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతుంది. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే చిన్న సినిమా అయినా గొప్పగా ఆదరిస్తారని ‘హునుమాన్’ మరోసారి రుజువు చేసింది.
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం యువ దర్శకులు తమ సత్తా చాటుకుంటున్నారు. రచయితగా కెరీర్ ఆరంభించి దర్శకుడిగా మారిన ప్రశాంత్ వర్మ.. కల్కి, జాంబి రెడ్డి లాంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రతి సినిమాలోనూ వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంటున్నాడు. సంక్రాంతి కానుకగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘హనుమాన్’ మూవీ రిలీజ్ అయి ప్రభంజనం సృష్టిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. హనుమాన్ ఆల్ టైమ్ రికార్డులతో దూసుకుపోతోంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన హనుమాన్ ఓవర్సీస్ లో కూడా రికార్డుల మోత మోగిస్తుంది.
హనుమాన్ ఇప్పుడు స్టార్ హీరోల రికార్డులు బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. మొదట బాలీవుడ్ లో హనుమాన్ పెద్దగా ప్రభావం చూపించదని భావించారు.. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ హిందీ వెర్షన్ లో కూడా అదరగొడుతుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, అలా వైకుంఠపురములో సినిమాల రికార్డులు బద్దలు కొడుతూ అమెరికాలో ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటివరకు అమెరికాలో ఏకంగా 3 మిలియన్ డాలర్ మార్క్ దాటి అరుదైన రికార్డు క్రియేట్ చేసిందని టాక్ వినిపిస్తుంది. ఈ మార్క్ దాటిన తెలుగు చిత్రాలు చాలా తక్కువే అంటున్నారు. అలాంటిది రిలీజ్ అయిన నాలుగు రోజులకే ఆ మార్క్ చేరుకుంది. ఉత్తర అమెరికాలో ఒక్క ఆదివారమే అత్యధిక కలెక్షన్లు రాబట్టి అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. హనుమాన్ చిత్రం కన్నా ముందు బాహుబలి, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ మూవీస్ ఆదివారం అత్యధిక కలెక్షన్లు సాధించిన తొలి రెండు స్థానాల్లో ఉంటే.. హనుమాన్ మూవీ మూడవ స్థానంలో ఉంది. ఏది ఏమైనా చిన్న చిత్రంగా రిలీజ్ అయి పెద్ద హీరోల రికార్డులు బ్రేక్ చేయడంతో కంటెంట్ పవర్ అలా ఉంటుందని ఆడియన్స్ అంటున్నారు. మరి పెద్ద హీరోల రికార్డులను హనుమాన్ మూవీ బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.