Hanuman: తెలుగులో హనుమాన్‌ బ్లాక్‌ బాస్టర్‌.. మరీ హిందీ సంగతేంటి?

హనుమాన్‌ సినిమా తెలుగులో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో శుక్రవారం విడుదల అయింది. ఈ సినిమా తెలుగులో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. మరి హిందీలో హనుమాన్‌ టాక్‌ ఏంటి?

హనుమాన్‌ సినిమా తెలుగులో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో శుక్రవారం విడుదల అయింది. ఈ సినిమా తెలుగులో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. మరి హిందీలో హనుమాన్‌ టాక్‌ ఏంటి?

భారీ అంచనాల నడుమ విడుదలైన హనుమాన్‌ అంచనాలకు మించి విజయాన్ని సాధించింది. నిన్న మధ్యాహ్నమే సినిమా టాక్‌ బయటకు వచ్చింది. బొమ్మ బ్లాక్‌ బాస్టర్‌ అని తేలింది. ఇక, సాయంత్రం స్పెషల్‌ షోలకు వెళ్లిన వారు.. హనుమాన్‌ ట్రాన్స్‌లో నుంచి బయటకు రావటానికి కొంత సమయం పడుతుందని అన్నారు. చివరి 20 నిమిషాలు గూస్‌బమ్స్‌ రావటం ఖాయమని చెప్పారు. ఇక, శుక్రవారం ఉదయం నుంచి దేశ వ్యాప్తంగా షోలు పడ్డాయి. తెలుగులో బ్లాక్‌  బాస్టర్‌ అయిన ఈ సినిమాకు హిందీలో ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చిందంటే..

హిందీ ప్రేక్షకులకు హనుమాన్‌ పిచ్చ పిచ్చగా నచ్చేశాడు. సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్లను రేటింగ్‌ అడగ్గా.. చాలా మంది 5కు 5.. మరికొంతమంది 10కి 10 కూడా ఇచ్చారు. హనుమాన్‌ లాంటి సినిమాలు చేయటం సౌత్‌ వారికే సాధ్యం అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. చివరి 20 నిమిషాలపై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు.  హనుమాన్‌లోని కొన్ని సీన్లకు తమకు గూస్‌బమ్స్‌ వచ్చాయని అన్నారు. హనుమాన్‌ను రెండు మూడు సార్లు చూడాలంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

హనుమాన్‌ కథ ఏంటంటే..

అంజనాద్రి అనేది ఓ చిన్న పల్లెటూరు. ఆ ఊరు సముద్ర తీరంలో ఉంటుంది. ఆ ఊరిలో హనుమంతు( తేజసజ్జ) చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అల్లరి, చిల్లరిగా తిరుగుతూ ఉంటాడు. హనుమంతు అక్క అంజమ్మ( వరలక్ష్మీ శరత్‌కుమార్‌)కు తమ్ముడంటే ప్రాణం. హనుమంతు మీనాక్షి( అమృత అయ్యర్) అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటాడు. అత్యంత బలహీనుడైన హనుమంతు.. మీనాక్షి ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నించి ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. ఆ ప్రమాదంలోనే హనుమంతుకి.. హనుమంతుడి శక్తులు సిద్ధిస్తాయి.

ఈ నేపథ్యంలోనే ఎ‍ప్పటికైనా సూపర్ హీరో అవ్వాలని తహతహలాడే మైఖెల్(వినయ్ రాయ్)కు ఈ విషయం తెలుస్తుంది. అంజనాద్రి గ్రామాన్ని టార్గెట్‌ చేస్తాడు. హనుమంతుకి హనుమన్ శక్తులు ఎలా వచ్చాయి? అతని వెనుక ఉండి నడిపించిన శక్తి ఏమిటి? ఆ సూపర్ హీరో పవర్స్ కోసం ప్రయత్నించిన మైఖెల్ ఏమయ్యాడు? అన్నదే మిగిలిన కథ. బాహుబలి సినిమాలోలా ఇందులో కూడా క్లైమాక్స్‌ ట్విస్ట్‌ ఉంది. అసలు.. శ్రీరామ చంద్రమూర్తికి ఆ హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరి, హనుమాన్‌ సినిమా సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments