Hanuman: ‘గుంటూరు కారం’ ను వెనక్కి నెట్టిన ‘హనుమాన్’! లెక్క మారింది!

హనుమాన్‌ సినిమా జనవరి నెలలోనే విడుదల కానుంది. ఈ మూవీకి పోటీగా స్టార్‌ హీరోల చిత్రాలు కూడా ఉన్నాయి. గుంటూరు కారం, సైంధవ్‌ సినిమాలు విడుదల కానున్నాయి.

హనుమాన్‌ సినిమా జనవరి నెలలోనే విడుదల కానుంది. ఈ మూవీకి పోటీగా స్టార్‌ హీరోల చిత్రాలు కూడా ఉన్నాయి. గుంటూరు కారం, సైంధవ్‌ సినిమాలు విడుదల కానున్నాయి.

ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ హనుమాన్‌’ విడుదలకు కొద్దిరోజులు మాత్రమే ఉంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 12వ తేదీ నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఇదే సమయంలో హనుమాన్‌కు పోటీగా స్టార్‌ హీరోల సినిమాలు కూడా విడుదల కానున్నాయి. మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబోలో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ కూడా ఇదే రోజున విడుదల అ‍వ్వనుంది.

తరువాతి రోజున వెంకటేష్‌- శైలేష్‌ కొలను కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ సైంధవ్‌’ సినిమా విడుదల కానుంది. వీటితో పాటు నాగార్జున నటించిన ‘ నా సామిరంగ’ జనవరి 14న విడుదల కానుంది. ఇక, హనుమాన్‌ సంక్రాంతి బరిలో స్టార్‌ హీరోలకు పోటీగా రావటంపై గత కొంత కాలం నుంచి వివాదం నడుస్తోంది. తమ చిత్రాన్ని ఆపటానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ దర్శకుడు ప్రశాంత వర్మ సంచలన కామెంట్లు చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్లు చేశారు.

ఇంత పోటీ, ప్రెసర్‌ మధ్యలోనూ హనుమాన్‌ తన సత్తా చాటుతోంది. తాజాగా, హనుమాన్‌ ఖాతాలోకి ఓ రికార్డు వచ్చి చేరింది. గుంటూరు కారం సినిమాను బీట్‌ చేసి మరీ హనుమాన్‌ ఆ రికార్డును సాధించాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.. సాధారణంగా కొత్త సినిమా టికెట్లు బుక్‌ చేసుకోవటానికి అందరూ ‘బుక్‌ మై షో’ను ఫాలో అవుతూ ఉంటారు. ప్రీ బుకింగ్స్‌ మొదలు కాని పక్షంలో బుక్‌ మై షోలో.. ‘ మీరు ఈ సినిమా చూడ్డానికి ఇంట్రస్ట్‌గా ఉన్నారా?’ అన్న ప్రశ్న ఉంటుంది.

ఆ మూవీ చూడ్డానికి ఇష్టం ఉన్నవారు ‘అవును’ సమాధానం మీద క్లిక్‌ చేస్తూ ఉంటారు. తాజాగా, సంక్రాంతి బరిలో ఉన్న గుంటూరు కారం, సైంధవ్‌, హనుమాన్‌ సినిమాలకు కూడా ఈ ప్రశ్న ఉంచగా.. ఎక్కువ మంది హనుమాన్‌ సినిమాకే ఓటు వేశారు. ‘హనుమాన్’ సినిమాకి ఏకంగా 169.5K అంటే లక్షా అరవై తొమ్మిది వేల మంది తాము ఆసక్తిగా ఉన్నామన్నారు. తర్వాతి స్థానంలో ‘గుంటూరు కారం’కు 168.7K అంటే లక్షా అరవై ఎనిమిది వేలకు పైగా మంది తాము ఆసక్తిగా ఉన్నామని తెలిపారు.

సైంధవ్‌ సినిమాకు 63 వేల మంది.. నా సామిరంగాకు 41 వేల మంది తాము ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. దీంతో హనుమాన్‌ వైపు ఎక్కువ మంది ఆసక్తిగా ఉన్నారన్న సంగతి క్లియర్‌గా అర్థమైపోయింది. మరి, హనుమాన్‌ క్రియేట్‌ చేసిన ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments