Venkateswarlu
హనుమాన్ జనవరి 12 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల అయిన అన్ని భాషల్లోనూ బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ కేవలం 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినట్లు సమాచారం.
హనుమాన్ జనవరి 12 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల అయిన అన్ని భాషల్లోనూ బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ కేవలం 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినట్లు సమాచారం.
Venkateswarlu
టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు ‘ప్రశాంత్ వర్మ’- యంగ్ హీరో తేజ సజ్జ కాంబినేషన్‌లో తెరకెక్కిన హనుమాన్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అయింది. విడుదల అయిన అన్ని భాషల్లో మూవీ సూపర్ సక్సెస్ అయింది. ప్రేక్షకులతో పాటు రివ్యూవర్లు కూడా హనుమాన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో హనుమాన్ సినిమా నటీనటులు, దర్శకుడి రెమ్యూనరేషన్‌పై చర్చ మొదలైంది.
ఈ మేరకు కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తల ప్రకారం.. హీరో తేజ సజ్జ 2 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఇక, దర్శకుడు ప్రశాంత్ వర్మ దాదాపు 70 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల మధ్య రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అమృత అయ్యర్ 1.5 కోట్ల రూపాయలు, వరలక్ష్మీ శరత్ కుమార్ కోటి రూపాయలు, వినయ్ రాయ్ 65 లక్షల రూపాయలు, వెన్నెల కిషోర్ 55 లక్షల రూపాయలు, గెటప్ శీను 35 లక్షల రూపాయలు తీసుకున్నారు.
అయితే, ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలీదు. కానీ, ఇదే గనుక నిజం అయితే, ఈ ఖర్చు మొత్తం కలిపీ 10 కోట్లు కూడా కాలేదు. ప్రశాంత్ వర్మ హనుమాన్ కోసం దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడని సమాచారం. మిగిలిన బడ్జెట్ మొత్తంలో దాదాపు సగానికిపైగా గ్రాఫిక్స్ కోసం వాడినట్లు తెలుస్తోంది. అందుకే సినిమాలో గ్రాఫిక్స్ హాలీవుడ్ మూవీస్‌కు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నాయి. చివరి 20 నిమిషాల క్లైమాక్స్ మూవీకి హైలెట్‌గా నిలుస్తుంది.
ఇక, ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా అయితే, మూవీ రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను క్లియర్ చేస్తుంది. తర్వాతినుంచి సినిమా లాభాల బాటలో పయనిస్తుంది. దీనికి తోడు ఓటీటీ, శాటిలైట్ రైట్స్ నుంచి మరింత ఆదాయం రానుంది. ఈ రెండు హక్కులు భారీ మొత్తానికి అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. మరి, హనుమాన్ సినిమా నటీ,నటులు.. దర్శకుడి రెమ్యూనరేషన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.