Venkateswarlu
హనుమాన్‌కు దేశ వ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. సినిమా చూసిన వారంతా హనుమాన్ అద్భుతంగా ఉందని అంటున్నారు. మొదటి రోజు ఈ చిత్రం 2ం కోట్లు కలెక్ట్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
హనుమాన్‌కు దేశ వ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. సినిమా చూసిన వారంతా హనుమాన్ అద్భుతంగా ఉందని అంటున్నారు. మొదటి రోజు ఈ చిత్రం 2ం కోట్లు కలెక్ట్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Venkateswarlu
హనుమాన్ మూవీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన చిత్రం.. బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. సాధారణ ప్రేక్షకులతో పాటు రివ్యూవర్లు కూడా మూవీకి మంచి రివ్యూలు ఇచ్చారు. సినిమాలోని చివరి 20 నిమిషాల గురించి జనం ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. ఆదిపురుష్ గ్రాఫిక్స్‌తో కంపైర్ చేస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో సినిమా ఎలా తీయాలో ప్రశాంత్ వర్మ దగ్గర నేర్చుకోమని సలహా ఇస్తున్నారు. ఇంతకీ హనుమాన్ ఎంత బడ్జెట్‌లో తెరకెక్కింది? సినిమా ఎంత కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది? హనుమాన్ మూవీ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయనుంది? ఆ వివరాలు…
హనుమాన్ బడ్జెట్ ఎంత?..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. హనుమాన్ సినిమా దాదాపు 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది. మొదట ఈ మూవీ బడ్జెట్ చాలా తక్కువగా ఉండిందట. 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో మూవీని ముగించాలని నిర్మాతలు, దర్శకుడు భావించారట. అయితే, టీజర్‌కు వచ్చిన స్పందనతో క్వాలీటీపై ఫోకస్ పెట్టారట. కేవలం గ్రాఫిక్స్ కోసం దాదాపు 12 కోట్లు వెచ్చించారట. ప్రమోషన్స్, ఇతర విషయాల కోసం మిగిలిన మొత్తం ఖర్చు అయిందట. హనుమాన్ బడ్జెట్ ఫైనల్‌గా 30 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది.
హనుమాన్ బ్రేక్ ఈవెన్ ఎంత?
హనుమాన్ టీజర్ విడుదల అయిన తర్వాత సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్యాన్ ఇండియా లెవెల్‌లో మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. కేవలం థియేట్రికల్ రైట్స్ ద్వారా ఈ మూవీకి 30 కోట్లు వచ్చి పడ్డాయి. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే.. 30 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ మూవీకి మంచి టాక్ ఉంది కాబట్టి.. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.
ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్‌ను కేవలం రెండు రోజుల్లోనే హనుమాన్ చేరుకునే అవకాశం ఉంది. ఇక లాభాల విషయానికి వస్తే.. హనుమాన్ నిర్మాతలకు బంగారు పంట పండనుంది. ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ఇలా అన్ని రకాలుగా డబ్బులు వస్తాయి. ఇప్పటికే హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్, శాటిలైట్ ప్లాట్ ఫామ్స్ ఇప్పటికే ఫిక్స్ అయ్యాయి. ‘ జీ 5’లో హనుమాన్ స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇక, శాటిలైట్ పార్ట్‌నర్ విషయానికి వస్తే.. జీ టీవీలో హనుమాన్ ప్రసారం కానుంది.
హనుమాన్ మూవీ ఓటీటీ, శాటిలైట్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయినట్లు తెలుస్తోంది. తెలుగు వర్సన్‌తో పాటు హిందీ వర్సన్‌కు కోట్ల రూపాయలు వచ్చినట్లు సమాచారం. హిందీ ఓటీటీ వర్సన్ 5 కోట్ల రూపాయలకు, తెలుగు వర్సన్ 11 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికి కొత్త సంవత్సరం ప్రారంభంలోనే హనుమాన్ తెలుగు సినిమాకు భారీ విజయాన్ని అందించాడు. మరి, హనుమాన్ బడ్జెట్, బ్రేక్ ఈవెన్ లెక్కలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.