Venkateswarlu
గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. నిన్న విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.
గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. నిన్న విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.
Venkateswarlu
గుంటూరు కారం సినిమా విడుదలకు కేవలం మూడు రోజులు మాత్రమే ఉంది. ఈ సినిమా జనవరి 12వ తేదీన థియేటర్లలోకి రానుంది. మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో.. చిత్ర బృందం నిన్న గుంటూరు కారం ట్రైలర్‌ను విడుదల చేసింది. యూట్యూబ్‌లో ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. కొత్త రికార్డులు సైతం క్రియేట్ చేస్తోంది. యూట్యూబ్‌లోకి వచ్చిన 13 గంటల్లోనే 20 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించింది. నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది.
ఇక, ఈ నేపథ్యంలోనే.. ట్రైలర్‌లోని కొన్ని విషయాలు కొత్త కొత్త పుకార్లకు ప్రచారాలకు దారి తీస్తున్నాయి. ‘ మీరు మీ పెద్దబ్బాయిని అనాథలాగా వదిలేశారని అంటున్నారు’ అని ట్రైలర్ స్టార్టింగ్‌లోనే ఓ డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ కారణంగా మహేష్ బాబుకు తమ్ముడో.. అన్నో ఉంటాడని తెలుస్తోంది. మహేష్ బాబు ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేసి ఉంటారన్న ప్రచారం సోషల్ మీడియాలో గట్టిగా నడుస్తోంది. ‘ మీరు మీ పెద్దబ్బాయిని అనాథలాగా వదిలేశారని అంటున్నారు’ అన్న డైలాగ్ వచ్చే సమయంలోనే..
బాంబ్ బ్లాస్ట్ లాంటి విధ్వంసం జరుగుతుంది. అప్పుడు క్లోజప్ షాట్‌లో మహేష్ బాబు చిన్నప్పటి రోల్ ఉంటుంది. జూనియర్ మహేష్ బాబు కంట్లోకి ఓ నిప్పురవ్వ కూడా పడుతుంది. ఆ నిప్పు రవ్వ కారణంగా మహేష్ ఎడమ కన్ను దెబ్బ తిని ఉంటుదని, మహేష్ బాబు హాఫ్ బ్లైండ్‌గా కనిపించనున్నారన్న ప్రచారం నడుస్తోంది. ట్రైలర్ ఎండింగ్‌లో మహేష్ బాబు ఎడమ కన్నుమూసి కొన్ని డైలాగులు చెబుతూ ఉంటాడు. ఆయన హాఫ్ బ్లైండ్ కాబట్టే.. అలా మాట్లాడుతూ ఉన్నాడని కొంతమంది నెటిజన్లు అంటున్నారు.
అయితే, ఈ ప్రచారాల్లో ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే. మూవీ వస్తే గానీ, ఈ ప్రచారాలకు బ్రేక్ పడదు. కాగా, గుంటూరు కారం మూవీలో మహేష్ బాబుకు జంటగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, జగపతి బాబు, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందించారు. మరి, గుంటూరు కారం సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్ లో అది కూడా.. హాఫ్ బ్లైండ్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడని జరుగుతున్న ప్రచారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.