గుంటూరు కారం ఫస్ట్‌ డే కలెక్షన్‌.. ఎంత రాబట్టిందంటే..

Guntur Kaaram Day 1/First Day Collection: గుంటూరు కారం ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి మంచి టాక్‌ లభించింది. మొదటి రోజు ఎంత కలెక్ట్‌ చేసిందంటే..

Guntur Kaaram Day 1/First Day Collection: గుంటూరు కారం ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి మంచి టాక్‌ లభించింది. మొదటి రోజు ఎంత కలెక్ట్‌ చేసిందంటే..

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ‘‘ గుంటూరు కారం’’సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12 తేదీన విడుదల అయింది. ఈ మూవీకి మంచి టాక్‌ వచ్చింది. సాధారణ ప్రేక్షకులతో పాటు రివ్యూవర్లు కూడా ఈ చిత్రానికి మంచి రివ్యూలు ఇచ్చారు. ఇక, కలెక్షన్ల విషయానికి వస్తే.. అన్ని సెంటర్లలో మంచి కలెక్షన్లను రాబట్టింది.

గుంటూరు కారం సినిమా  మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా చిత్ర కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

  • రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా : 44.50 కోట్ల రూపాయలు

నిజాం : 11.50 కోట్లు
ఉత్తరాంధ్ర : 3.2 కోట్లు
సీడెడ్‌ : 3.25 కోట్లు
ఈస్ట్‌ : 4.0 కోట్లు
గుంటూరు : 3.7 కోట్లు
వెస్ట్‌ : 2.6 కోట్లు
క్రిష్ణ : 2.53 కోట్లు
నెల్లూరు : 1.32 కోట్లు

  • కర్ణాటక : 4.5 కోట్ల రూపాయలు
  • తమిళనాడు : 50 లక్షల రూపాయలు
  • మిగిన రాష్ట్రాల్లో : 50 లక్షల రూపాయలు
  • ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల రూపాయలు

కలెక్షన్లకు సంబంధించి చిత్ర యూనిట్‌ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, గుంటూరు కారం సినిమాలో మహేష్‌ బాబుకు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ, జగపతి బాబు, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. దాదాపు 200 కోట్ల రూపాయలతో సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది.

ఇంతకీ గుంటూరు కారం సినిమా కథ ఏంటంటే..

జనదళం పార్టీ అధినేత వైరా వెంకట సూర్యనారాయణ(ప్రకాష్ రాజ్)కు ఆ ప్రాంతంలో ఎంతో పేరు ప్రతిష్టలు ఉంటాయి. సూర్యనారాయణ ఏకైక కుమార్తె వసుంధర(రమ్యకృష్ణ) తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తుంది. మంత్రి పదవి దక్కించుకుంటుంది. అయితే.., ఆమె తన పెద్ద కొడుకు రమణ(మహేష్ బాబు)ని చిన్న వయసులోనే వదిలేసి రెండో పెళ్లి చేసుకుంటుంది. అతడికి దూరంగా ఉంటుంది. పాతికేళ్ల తరువాత రమణతో వెంకట సూర్యనారాయణ కుటుంబానికి అవసరం ఏర్పడుతుంది. అది కూడా కుటుంబ రాజకీయ భవిష్యత్ కోసం. అమ్మ ప్రేమకి నోచుకోని రమణ.. ఆ కుటుంబ అవసరం తీర్చాడా? లేదా? అన్నదే గుంటూరు కారం కథ. మరి, గుంటూరు కారం సినిమా మొదటి రోజు కలెక్షన్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments