ధనుష్‌, ఐశ్వర్యలకు తీపి కబురు చెప్పిన హైకోర్టు!

ప్యాన్‌ వరల్డ్‌ స్టార్‌ ధనుష్‌.. రజినీకాంత్‌ చిన్నకూతురు, దర్శకురాలైన  సౌందర్య రజినీకాంత్‌లతో పాటు ఆమె సోదరి ఐశ్వర్య రజినీకాంత్‌లకు సంబంధించిన ఓ కేసులో చెన్నై కోర్టు కీలక తీర్పునిచ్చింది. వీరిపై వేసిన కేసును తాజాగా కొట్టి వేసింది. ఇంతకీ సంగతేంటంటే.. ధనుష్‌- సౌందర్యల ​కాంబినేషన్‌లో 2014లో ‘వేల ఇల్లాద పట్టదారి’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా తెలుగులో ‘రఘువరన్‌ బీటెక్‌’గా డబ్‌ అయింది. తమిళంలోనూ.. తెలుగులోనూ ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాకు సౌందర్య దర్శకత్వం వహించగా.. ఐశ్వర్య నిర్మాతగా వ్యవహరించారు.

ఇక, ఈ  సినిమాలో పదుల సంఖ్యలో సిగరెట్‌, మందు తాగే సిన్లు ఉండటంతో చర్చనీయాంశంగా మారింది. దానికి తోడు సిగరెట్‌, మందు తాగే సన్నివేశాలు వచ్చేటపుడు హెచ్చరికలను జారీ చేయకపోవటంతో వివాదం మొదలైంది. పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ పీపుల్స్‌ క్రాఫ్ట్‌ ఆర్గనైజేషన్‌ .. తమిళనాడు ప్రభుత్వంతో కలిసి ‘వేల ఇల్లాద పట్టదారి’పై సైదాపేట్‌ కోర్టులో కేసు వేసింది. అది కూడా చిత్ర హీరో ధనుష్‌తో పాటు, దర్శకురాలు సౌందర్య, నిర్మాత ఐశ్వర్యలపై కేసు వేసింది.

ఈ కేసుపై ధనుష్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ధనుష్‌ తరపు న్యాయవాది ‘నో స్మోకింగ్‌ యాక్ట్‌ 2003’ను తెరపైకి తెస్తూ  కోర్టులో తన వాదనలు వినిపించారు. పొగాకుకు సంబంధించిన యాడ్లలో మాత్రమే వార్నింగ్‌లు వేయాల్సి ఉంటుందని, సినిమాలకు అది అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. కోర్టు ధనుష్‌ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించింది. తాజాగా, ఈ కేసును కొట్టి వేస్తూ తీర్పును తుది వెలువరించింది. దీంతో ధనుష్‌- ఐశ్వర్య- సౌందర్యలు ఊపిరి పీల్చుకున్నారు. కేసు కొట్టి వేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Show comments