Venkateswarlu
అవార్డ్స్ ఫంక్షన్‌లో అవమానం జరిగిందట కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. హీరో రమేష్ అరవింద్ మాట్లాడుతూ.. ఫంక్షన్‌లో జరిగిన దానిపై వివరణ ఇవ్వాలని అన్నారు..
అవార్డ్స్ ఫంక్షన్‌లో అవమానం జరిగిందట కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. హీరో రమేష్ అరవింద్ మాట్లాడుతూ.. ఫంక్షన్‌లో జరిగిన దానిపై వివరణ ఇవ్వాలని అన్నారు..
Venkateswarlu
సినిమా తారల కష్టానికి, ఇష్టానికి ఓ మంచి గుర్తింపు అభినందనలు, అవార్డులే అని చెప్పొచ్చు. సినిమాల్లో తన కృషికి ఏదైనా అవార్డు వచ్చినపుడు సినిమా తారలు ఎంతో సంతోషానికి గురవుతూ ఉంటారు. రెట్టించిన ఉత్సాహంతో పని చేయటానికి వారికి అవార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే, కొన్ని సార్లు అవార్డుల ఫంక్షన్లలో నటీ, నటులకు .. ఇతర సినిమా వర్గానికి చెందిన వారికి అవమానం జరగటం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ అరుదైన ఘటనకు గోవాలో జరిగిన ఓ అవార్డ్స్ ఫంక్షన్ వేదికైంది.
కొద్దిరోజుల క్రితం గోవాలో ఓ అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన వారికి అవార్డులు అందించారు. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖులకు ఈ అవార్డు ఫంక్షన్ కోసం ఆహ్వానం అందింది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి మొత్తం 35 మందిని ఆహ్వానించారు. ఈ అహ్వానం మేరకు.. కన్నడ స్టార్ హీరో రమేష్ అరవింద్, కాంతార ఫేమ్ సప్తమి గౌడ, నిర్మాత శైలజా నాగ్ తదితర ప్రముఖులు గోవా వెళ్లారు.
హీరో రమేష్ అరవింద్ సొంత చిత్ర పరిశ్రమకు చెందిన వారికి అవార్డులు ప్రదానం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో స్టేజిపై కరెంట్ పోయింది. ఎంతకీ రాలేదు. లైట్స్, సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసిన వారికి డబ్బులు ఇవ్వకపోవటంతో లైట్స్ ఆఫ్ చేసినట్లు తెలిసింది. రమేష్‌తో పాటు ఇతర నటీనటులు చీకట్లో ఉండిపోయారు. చేసేదేమీ లేక అక్కడినుంచి మళ్లీ బెంగళూరుకు తిరిగి వచ్చారు. అనంతరం రమేష్‌ను కన్నడ మీడియా ఛానళ్లు ఈ సంఘటనపై ప్రశ్నించాయి.
రమేష్ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కేవలం కన్నడ నటీ,నటులకు మాత్రమే కాదు.. అన్ని భాషల నటీ,నటులకు ఇబ్బంది అయింది. కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగు భాషలకు చెందిన వారిని పిలిచారు. సౌత్ ఇండియా అవార్డ్స్ అని చెప్పారు. అక్కడ ఏదో గొడవ జరిగింది. అదేంటో నాకు సరిగా తెలీదు. తెలుగు అవార్డ్స్ అయిపోయాయి. కన్నడకు సంబంధించి కొన్ని అవార్డులు ఇవ్వడానికి నన్ను స్టేజిపైకి పిలిచారు. ఓ ఇద్దరు ముగ్గురికి అవార్డు ఇచ్చాను. నాలుగో అవార్డు ఇస్తున్నాను. స్టేజి మీద లైట్స్ ఆఫ్ అయిపోయాయి. ఏమైందని ఆరా తీస్తే.. లైట్స్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన వారికి డబ్బులు ఇవ్వలేదట. వాళ్లు లైట్స్ ఆన్ చేయమూ అని కూర్చున్నారు.
నాకు నవ్వు వచ్చింది. కన్నడ నుంచి వాళ్లు ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమందికి డెబ్యూ సినిమా అవార్డ్స్ రావాల్సి ఉంది. వాళ్లంతా ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ ఏదో ఫైనాన్షియల్ మిస్టేక్స్ అయినట్లు అనిపిస్తోంది. మాకు మాత్రమే అనుకున్నాం. హోటల్స్ విషయంలో తెలుగు, తమిళ వారికి కూడా అలానే జరిగింది. మాకు ఓ వివరణ కావాలి. అసలు ఏం జరిగింది? .. ఇక్కడినుంచి ఫ్లైట్‌లో తీసుకెళ్లారు. మంచిగా హోటల్స్ ఇచ్చారు. అంతా బాగానే ఉంది. కానీ, ఆ ఒక్క విషయంలో మాత్రం నాతో పాటు వచ్చిన కొత్త నటులకు క్షమాపణ చెప్పాలి. అసలేం జరిగిందో వివరణ ఇవ్వాలి’’ అని అన్నారు. మరి, అవార్డ్స్ ఫంక్షన్‌లో కన్నడ నటీనటులకు అవమానం జరగటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.