Devara: ‘దేవర’కు తప్పని తిప్పలు.. ఆయన సిటీ దాటకపోవడమే అసలు సమస్య!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కోసం అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకొని వేచి చూస్తున్నారు. తారక్ యాక్టింగ్ మ్యాజిక్​ను స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేసేందుకు చాన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కోసం అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకొని వేచి చూస్తున్నారు. తారక్ యాక్టింగ్ మ్యాజిక్​ను స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేసేందుకు చాన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కోసం అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకొని వేచి చూస్తున్నారు. తారక్ యాక్టింగ్ మ్యాజిక్​ను స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేసేందుకు చాన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈపాటికే సినిమా ఆడియెన్స్ ముందుకు రావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యమవడం, ఇతర పనులు కూడా పూర్తి కాకపోవడంతో రిలీజ్ డిలే అయింది. అయితే ఎట్టకేలకు సెప్టెంబర్ 27న ‘దేవర’ను అభిమానుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ పరిస్థితి చూస్తుంటే ఆ డేట్​కు రిలీజ్ కావడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ఒక్కడు వస్తే గానీ ‘దేవర’ కంప్లీట్ కాదని అంటున్నారు.

‘దేవర’ టాకీ పార్ట్ దాదాపుగా పూర్తయిందని తెలుస్తోంది. ఇంకొన్ని వారాల్లో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పరుగులు పెట్టిస్తారని సమాచారం. అయితే ఇప్పటిదాకా తారక్ నయా ఫిల్మ్ నుంచి ఒక్క సాంగ్ మాత్రమే బయటకు వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఫుల్ బిజీగా ఉండటంతో రెండో లిరికల్ సాంగ్ లేట్ అవుతోందని టాక్. ‘మేజిక్’, తలైవా రజినీకాంత్ ‘కూలి’, కమల్ హాసన్ ‘భారతీయుడు 3’, అజిత్ ‘విదామయార్చి’, విఘ్నేష్​ శివన్ ‘లవ్ ఇన్సూరెన్స్’.. ఇలా వరుస ప్రాజెక్టులతో అనిరుధ్ చెన్నై దాటి కాలు బయటపెట్టలేని సిచ్యువేషన్. ఇన్ని ప్రాజెక్టుల మధ్య ‘దేవర’కు అనిరుధ్ ఎలా టైమ్ కేటాయిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

‘దేవర’లో మిగతా సాంగ్స్​తో పాటు బీజీఎం పార్ట్ పూర్తై ఫైనల్ కాపీ చేతిలో రావాలంటే అనిరుధ్ హైదరాబాద్ రావాల్సిందే. అసలే ‘ఆచార్య’ విషయంలో కొరటాల శివ మీద నెగెటివిటీ వచ్చింది. ఆ సినిమా మ్యూజిక్ విషయంలో కొరటాల ఇంకా కచ్చితత్వంతో ఉండి ఉంటే బాగుండేదనే కామెంట్స్ వినిపించాయి. అందుకే ‘దేవర’ కోసం ప్రతిదీ పర్ఫెక్ట్​గా ఉండాలని స్టార్ డైరెక్టర్ కోరుకుంటున్నారట. సాంగ్స్​తో పాటు బీజీఎం కూడా అదిరిపోవాలని భావిస్తున్నారట. మూవీ నుంచి బయటకు వచ్చిన ‘ఫియర్ సాంగ్’ ఛార్ట్​బస్టర్​గా నిలిచింది. దీంతో అన్ని పాటలు అదే రేంజ్​లో ఉండాలని ఫ్యాన్స్ కూడా ఎక్స్​పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు. చేతిలో బోలెడు ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్న అనిరుధ్​ది చెన్నై దాటి కాలు బయట పెట్టలేని పరిస్థితి. కానీ కొరటాల శివ పర్ఫెక్షన్, అభిమానుల అంచనాలకు తగ్గట్లు ఆల్బమ్ ఇవ్వాలంటే ఆయన భాగ్యనగరానికి రావాల్సిందే. మరి.. ‘దేవర’లో అనిరుధ్ మార్క్ మ్యూజిక్ ఉంటుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

Show comments