Nidhan
Devara Movie, Jr NTR, Daavudi Song: ‘దేవర’ జాతరకు అంతా సిద్ధమైంది. ఇంకొన్ని గంటల్లో ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.
Devara Movie, Jr NTR, Daavudi Song: ‘దేవర’ జాతరకు అంతా సిద్ధమైంది. ఇంకొన్ని గంటల్లో ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.
Nidhan
‘దేవర’ జాతరకు అంతా సిద్ధమైంది. ఇంకొన్ని గంటల్లో ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. శుక్రవారం నుంచి తారక్ కొత్త మూవీ సందడి మొదలవనుంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇప్పటికే మిడ్నైట్ షోస్‌తో పాటు ఫ్యాన్స్ షోస్ ఫుల్ అయిపోయాయి. రిలీజ్‌కు ఇంకొన్ని గంటల్లే ఉండటంతో అభిమానులు వెయిట్ చేయలేకపోతున్నారు. తారక్ మాస్‌ను చూసేందుకు ఓపిక పట్టలేకపోతున్నారు. అతడి యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ తరుణంలో ‘దేవర’ మేకర్స్ తీసుకున్న నిర్ణయం గురించి చర్చ జరుగుతోంది. రిలీజ్‌కు ముందు ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటనే డిస్కషన్స్ ఊపందుకున్నాయి.
‘దేవర’ మీద ఇంత హైప్, క్రేజ్ నెలకొనడానికి సాంగ్స్ కూడా ప్రధాన కారణమని చెప్పాలి. మూవీ నుంచి తొలుత విడుదలైన ‘ఫియర్’ సాంగ్ అందర్నీ ఊపేసింది. ‘దేవర ముందర నువ్వెంత’ అనే లిరిక్ తారక్ ఫ్యాన్స్‌కు అడ్రెలైన్ రష్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘చుట్టమల్లే’ పాట ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. అనంతరం రిలీజ్ అయిన ‘దావూదీ’ సాంగ్ మరింత అప్లాజ్ తెచ్చుకుంది. ఇందులో ఎన్టీఆర్-జాన్వీ ఒకరితో మరొకరు పోటీపడి చేసిన మాస్ డ్యాన్స్ స్పెషల్ హైలైట్‌గా నిలిచింది. భారీగా వ్యూస్ దక్కించుకున్న ఈ సాంగ్ సినిమాలో ఉండే అవకాశాలు తక్కువేనని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీనిపై మరింత క్లారిటీ వచ్చింది. ‘దావూదీ’ సాంగ్‌ను మూవీలో నుంచి తీసేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
సినిమాలో ‘దావూదీ’ పాట ఎక్కడ పెట్టాలి? అనే డిస్కషన్ నడిచిందట. కొంత చర్చ తర్వాత ఎండ్ టైటిల్స్‌లో వేయాలని అనుకున్నారట. కానీ పార్ట్-2కి లీడ్ తర్వాత ఆ సాంగ్ వేస్తే కరెక్ట్ కాదని మేకర్స్ భావించారట. అందుకే ఫైనల్‌గా ఆ పాటను చిత్రంలో నుంచి తీసేయాలని డిసైడ్ అయ్యారని సమాచారం. దీంతో ‘దేవర’లో దావూదీ పాట ఉండకపోవచ్చునని వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. సో, మూవీ రిలీజ్ అయ్యాకే ‘దావూదీ’ సాంగ్ ఫిల్మ్‌లో ఉందా? లేదా? అనేది తేలుతుంది. మరి.. ‘దావూదీ’ పాట సినిమాలో ఉండాలా? వద్దా? మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.