చిరు ‘విశ్వంభర’ అప్డేట్స్ ఎంతవరకు వచ్చినట్లు !

మెగాస్టార్ చిరు నుంచి ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. చిరు ప్రెసెంట్ విశ్వంభర సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ కూడా రాకపోవడంతో ప్రేక్షకులు నిరాశకు గురౌవుతున్నారు.

మెగాస్టార్ చిరు నుంచి ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. చిరు ప్రెసెంట్ విశ్వంభర సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ కూడా రాకపోవడంతో ప్రేక్షకులు నిరాశకు గురౌవుతున్నారు.

దాదాపు చిరంజీవి సినిమాలన్నీ కూడా అందరికి ఆల్ టైమ్ ఫేవరేట్ అయిపోతూ ఉంటాయి. ఈ క్రమంలో రీసెంట్ గా జగదేకవీరుడు అతిలోక సుందరితో చిరు మరోసారి ప్రభంజనం సృష్టించాడు. ఆ సమయంలో ఎలాంటి రెస్పాన్స్ అయితే దక్కిందో ఇన్నేళ్ల తర్వాత జనాల్లో చిరు సినిమా అంటే అదే క్రేజ్ ఉండడం విశేషం. దీనితో ప్రెసెంట్ చిరు సినిమాల మీద అందరికి మరిన్ని అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు మూవీ టీం సినిమా గురించి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జులై లో రిలీజ్ కావాల్సిన తమ్ముడు , కింగ్డమ్ మూవీస్ పోస్ట్ పోన్ అవ్వడంతో.. ఆ ప్లేస్ ను విశ్వంభర దక్కించుకుంటుందేమో అని ఫ్యాన్స్ తెగ ఎదురుచూసారు. కానీ అది జరగలేదు. పైగా మూవీ టీం నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ లేదు. సినిమా స్టార్ట్ అయ్యి ఇన్ని నెలలు అయినా కూడా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో సినిమాపై పలువురు సందేహ పడుతున్నారు.

సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ నైతే విడుదల చేశారు కానీ. సినిమా రిలీజ్ డేట్ గురించి మాత్రం ఏ మాత్రం సౌండ్ లేదు. ఆల్రెడీ ఇప్పటికే సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది ఈ మూవీ. అసలు ఈ గ్యాప్ లోనే మూవీ రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ అసలు ఇలాంటి మూవీ ఒకటి ఉంది అనే సౌండ్ కూడా ఎక్కడా వినిపించడం లేదు. ఇక ఈ నెలలో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఆ తర్వాత జులై 24న ఇంద్ర రిరీలీజ్ ఉంది. సో అప్పుడు విశ్వంభర రిలీజ్ చేయరు. ఆగష్టు లో వార్ 2 , రజిని కాంత్ కూలి సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. సో అప్పుడు రిలీజ్ చేసే దైర్యం మేకర్స్ చేయరు. ఇలా చూసినట్లయితే ఇప్పట్లో విశ్వంభర తెరమీదకు వచ్చేలా లేదని అంతా భావిస్తున్నారు. ఇప్పటికైనా మూవీ టీం స్పందించి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలని అభిమానులు చర్చలు జరుపుతున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments