కుక్కల కోసం రూ.45 కోట్లు ఖర్చు చేస్తున్న.. బాలీవుడ్ స్టార్ హీరో

Bollywood Hero :దాదాపు చాలా మంది జంతు ప్రేమికులు ఉంటూ ఉంటారు. ఇక సినీ సెలెబ్రిటీల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఓ హీరో మాత్రం కేవలం కుక్కల కోసమే ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు చేస్తున్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరు.

Bollywood Hero :దాదాపు చాలా మంది జంతు ప్రేమికులు ఉంటూ ఉంటారు. ఇక సినీ సెలెబ్రిటీల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఓ హీరో మాత్రం కేవలం కుక్కల కోసమే ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు చేస్తున్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరు.

సినీ సెలెబ్రిటీలలో కూడా చాలా మంది జంతు ప్రేమికులు ఉన్నారు. అప్పుడప్పుడు వారంతా వారి పెట్స్ తో దిగిన ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు. ఇంకొంతమందైతే సమాజంలో జంతువుల పట్ల జరిగే అన్యాయాలను సైతం ప్రశ్నిస్తూ.. వాటిపై తమకు ఉన్న ప్రేమను కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమంలో చాలా మంది దగ్గర కాస్టలీ పెట్స్ ఏ ఉంటూ ఉంటాయి. ఇక వాటిని మెయింటైన్ చేయడం కూడా ఖర్చుతో కూడుకున్న పనే. అవన్నీ సెలెబ్రిటీలకు కామన్ .. కానీ ఇక్కడ ఓ హీరో మాత్రం కేవలం కుక్కల కోసమే ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు చేస్తున్నాడట. పైగా ఇప్పటివరకు మొత్తం 116 కుక్కలను దత్తత కూడా తీసుకున్నాడట. మరి ఈ హీరో ఎవరో .. ఏంటో తెలుసుకుందాం.

కేవలం కుక్కల కోసం.. రూ.45 కోట్లు ఖర్చు చేస్తూ.. వాటి కోసం ప్రత్యేకంగా విలాసవంతమైన కెన్నెల్స్ నిర్మించిన జంతు ప్రేమికుడు మరెవరో కాదు. బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి. బాలీవుడ్ లో ఈ హీరోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 70వ శతకంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మిథున్ చక్రవర్తి.. ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి.. ఇండస్ట్రీకి సూపర్ హిట్స్ ను అందించాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు కోట్లల్లో సంపాదిస్తున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా ఈ హీరోకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే..

మిథున్ చక్రవర్తి 116 కుక్కలను దత్తత తీసుకోడమే కాకుండా.. వాటి కోసం ముంబైలోని మాద్ ఐలాండ్ లో తన 1.5 ఎకరాల్లో వాటిని పెంచుతున్నాడట. వాటి కోసం ఆడుకోడానికి ప్రత్యేకమైన ప్లేస్, కొత్త టెక్నాలజీ వస్తున్న అన్ని వెసులుబాటులను కూడా అందిస్తున్నారట. గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో మిథున్ కోడలు ఈ విషయాన్నీ బయటపెట్టారు. “కుక్కల కోసం సొంత స్థలం. విభిన్నమైన గదులు. వాటిని చూసుకునేందుకు ప్రత్యేక సిబ్బంది. వాటికి భోజనం పెట్టడం, స్నానం చేయించడం, నడక కోసం తీసుకెళ్లడం ఇవన్ని చాలా పెద్ద బాధ్యతలు. అందుకే వాటి సంరక్షణ కోసం చాలా మంది సిబ్బంది ఉన్నారు:” అంటూ ఈ విషయాన్నీ చెప్పుకొచ్చారు. దీనితో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments