సినీ చరిత్రలోనే భారీ డిజాస్టర్‌.. రూ.45 కోట్లు పెడితే.. వచ్చింది రూ.75 వేలు.. ఆ సినిమా ఏదంటే

రూ.45 కోట్లు పెట్టి తెరకెక్కిస్తే.. కేవలం 75 వేల రూపాయలు వసూలు చేసి.. భారతీయ సినీ చరిత్రలో భారీ డిజాస్టర్‌గా నిలిచిన సినిమా ఏదో మీకు తెలుసా.. తెలియదా. ఆ వివరాలు మీకోసం.

రూ.45 కోట్లు పెట్టి తెరకెక్కిస్తే.. కేవలం 75 వేల రూపాయలు వసూలు చేసి.. భారతీయ సినీ చరిత్రలో భారీ డిజాస్టర్‌గా నిలిచిన సినిమా ఏదో మీకు తెలుసా.. తెలియదా. ఆ వివరాలు మీకోసం.

కరోనా తర్వాత సినిమాల విషయంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఓటీటీల హవా పెరగడంతో థియేటర్‌కు వెళ్లే జనాల సంఖ్య భారీగా తగ్గింది. బడ్జెట్‌తో సంబంధం లేకుండా.. బాగుంది అంటేనే థియేటర్‌కు వెళ్లి చూస్తున్నారు. పెద్ద హీరో సినిమా అయినా సరే ఇదే పరిస్థితి నెలకొని ఉంది. దాంతో రోటిన్‌ కథతో.. భారీ బడ్జెట్‌తో.. స్టార్‌ హీరోలు నటించిన సినిమాలు ఎన్నో ఈ మధ్య కాలంలో దారుణంగా దెబ్బతిన్నాయి. లాభాలు కాదు కదా.. పెట్టిన బడ్జెట్‌ కూడా రావడం లేదు. ఈ జాబితాలో బాలీవుడ్‌ చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి. హిందీలో తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన సూర్యవంశీ, భూల్ భూలయ్యా 2, ది కశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలు భారీ విజయం, వసూళ్లు సాధించాయి.

అలానే ఎన్నో అంచనాల మధ్య.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు ప్లాఫ్‌ అవుతున్నాయి. ఇందుకు తాజా నిదర్శనం.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘బడే మియాన్ చోటే మియాన్’ సినిమానే. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం భారీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఆ సంగతి అలా ఉంచితే.. భారతీయ సినీ చరిత్రలోనే భారీ డిజాస్టర్‌గా నిలిచిన సినిమా ఏదో తెలుసా.. 45 కోట్ల రూపాయలతో ఈ సినిమాను తెరకెక్కిస్తే.. కేవలం 70 వేల రూపాయలు వసూలు చేసింది. ఇంతకు అది ఏ చిత్రం అంటే..

భారతీయ సినీ చరిత్రలోనే భారీ డిజాస్టర్‌గా నిలిచిన సినిమా ఏది అంటే.. 2023 లో అర్జున్ కపూర్, భూమి ఫడ్నేకర్‌ నటించిన క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రం లేడి కిల్ల‌ర్. అసలు ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు వెళ్లిందో కూడా చాలా మందికి తెలియదు. ఈ మూవీ భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్లాప్‌గా నిలిచింది. 45 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా.. విడుదల సమయంలో దేశమంతటా కేవలం 293 టిక్కెట్లను విక్రయించి.. మొదటి రోజు రూ. 38,000 మాత్రమే సంపాదించింది. ఫైనల్ గ్రాస్ నమ్మశక్యం కానంత త‌క్కువ‌గా.. కేవలం 70,000 రూపాయలు మాత్రమే వసూలు చేసి భారీ డిజాస్టర్‌గా సినీ చరిత్రలో నిలిచిపోయింది.

లేడీ కిల్లర్‌ చిత్రం.. గతేడాది అనగా.. 2023, నవంబర్‌ 3న విడుదలైంది. దేశవ్యాప్తంగా కేవలం 12 షోలు మాత్రమే వేశారు. ఖర్చు ఎక్కువ కావడం, ఉత్తరాఖండ్‌లో వర్షం, రీషూట్‌లు కూడా చేయ‌క‌పోవడంతో ఈ సినిమా అసంపూర్తిగా విడుదలైనట్లు సమాచారం. ఫలితంగా నిర్మాణ బృందం అనేక ఎడిటింగ్ కట్‌లు .. వాయిస్ ఓవర్‌లపై ఆధారపడవలసి వచ్చింది. అసంపూర్తిగా ఉన్న షూట్‌లు, వాయిస్‌ ఓవర్‌లతో విడుద‌లై భారీ ఎత్తున విమర్శలు మూటకట్టుకుంది. సినిమా అసంపూర్తిగా ఉన్నా.. దీనిలో అర్జున్ కపూర్, భూమి ఫడ్నేకర్‌, ప్రియాంక బోస్ ల న‌ట‌న మీద ప్రశంసలు కురిపించారు. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల కాబోతోంది.

Show comments