సినీ పరిశ్రమలో నిర్మాత లేనిదే ఏదీ లేదు. ఒక ప్రొజెక్ట్ కార్యరూపం దాల్చాలంటే ప్రొడ్యూసర్ ఉండాల్సిందే. కథను, హీరోను, డైరెక్టర్‌ను నమ్మి డబ్బులు పెట్టే నిర్మాతకు ఎంత లాభాలు వస్తే అన్ని ఎక్కువ చిత్రాలు తీస్తాడు. అయితే ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్‌గా రాణించడం అంత ఈజీ కాదు. సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉండే చిత్ర పరిశ్రమలో రాణించాలంటే సినిమాలపై మక్కువతో పాటు లాభ, నష్టాలను బేరీజు వేసుకుంటూ పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్లాలి. అప్పుడే ఫ్లాప్‌లు వచ్చినా తట్టుకొని ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నెగ్గుకురావొచ్చు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్లలో అనిల్ సుంకర ఒకరు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఆయన ఆధ్వర్యంలోనే నిర్మించబడింది. ‘బిందాస్’, ‘నమో వెంకటేశ’, ‘దూకుడు’, ‘లెజెండ్’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’, ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి హిట్స్‌తో ప్రొడ్యూసర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారాయన. అయితే 2021 నుంచి అనిల్ సుంకరకు ఏదీ కలసి రావడం లేదు. సిద్ధార్థ్, శర్వానంద్‌లతో తీసిన మల్టీస్టారర్ ‘మహాసముద్రం’ డిజాస్టర్‌గా నిలిచింది. ఎన్నో ఆశలతో, భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘ఏజెంట్’ అయితే ఆయన్ను నిండా ముంచింది.
‘ఏజెంట్’తో తీవ్రంగా దెబ్బతిన్న అనిల్ సుంకరకు ఇటీవల విడుదలైన ‘సామజవరగమన’ రూపంలో మంచి హిట్ పడింది. ఈ సినిమాకు మంచి ప్రాఫిట్స్ రావడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేసిన ‘భోళా శంకర్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఏజెంట్’తో దెబ్బతిన్న అనిల్ సుంకర కష్టాలను ‘భోళా శంకర్’ తీర్చేస్తాడని అంతా అనుకుంటున్నారు. అఖిల్ మూవీతో రూ.కోట్లు నష్టపోయిన ఆయన ఈ మూవీతో సెట్ అవుతారని భావిస్తున్నారు.
‘ఏజెంట్’ సినిమా వల్ల అనిల్ సుంకరతో పాటు మూవీని కొన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీగా నష్టపోయారట. దీంతో వాళ్లకు ఆయన తిరిగి ఇవ్వాల్సింది కూడా ఉందట. ఈ నేపథ్యంలో అనిల్ సుంకర మీద ఒక డిస్ట్రిబ్యూటర్ కేసు వేశారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఓ డిస్ట్రిబ్యూటర్ ‘ఏజెంట్’ ఏపీ, కర్ణాటక రైట్స్‌ను కలిపి రూ.30 కోట్లకు కొన్నాడట. కానీ ఈ మూవీకి కనీసం రూ.2 కోట్లు కూడా రికవరీ కాలేదట. కానీ ఇప్పుడేమో తనకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా ‘భోళా శంకర్’ హక్కులను వేరేవాళ్లకు అనిల్ సుంకర అమ్మేశారంటూ ఆ డిస్ట్రిబ్యూటర్ కేసు వేశాడని వార్తలు వస్తున్నాయి.
Manchi ey chesadu kada sunkara sir https://t.co/w2npoi665O pic.twitter.com/BY3d0S7MpU
— వేటగాడు (@rao_4005) August 8, 2023
#Agent distributor Gayatri Satish filed a petition on producer #AnilSunkara. He bought entire Andhra Pradesh and KA rights for 30Cr NRA and only 1.5Cr recovered till now and the producer sold #BholaShankar to another distributor without informing him.
— TrackTollywood (@TrackTwood) August 8, 2023